వైఎస్సార్ కాంగ్రెస్‌లో తెలుగుదేశం, జనసేన నేతల చేరికలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులపై అనేక మంది పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్ర శ్రీసత్యసాయి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ, జనసేనకు చెందిన నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. సంజీవపురం స్టే పాయింట్ వద్ద పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ కీలక నాయకుడు వేణుగోపాల్, ఇంకా కె.పెద్దన్న, వెంకటస్వామి, జనసేన నుంచి తిరుపతేంద్రకు జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు
వేణుగోపాల్‌కు పుట్టపర్తి టికెట్ ఇస్తానని చంద్రబాబు నాయుడు నమ్మించారు. దీంతో ఆయన తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే బాబు వేణుగోపాల్‌ను మోసం చేశారు. ఈ టికెట్‌ను టీడీపీ అధిష్టానం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరారెడ్డికి ఇచ్చింది. దీంతో వేణుగోపాల్ తీవ్రంగా బాధపడ్డారు. నమ్మించి గొంతు కోయడం బాబుకు అలవాటేనని గ్రహించి జగన్ వెంట నడిచేందుకు నిర్ణయించుకున్నారు. కాగా సింధూరారెడ్డి పోటీ చేయడమే అనుమానమేనని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఆమెకు ఇష్టం లేకపోవడంతో ప్రచారంలో విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో తానే పోటీ చేస్తానని అనుచరులకు పల్లె సర్ది చెబుతున్నారు.