టీడీపీకి ఊపిరి పీల్చుకొనే వ్యవధి ఇవ్వకుండా రాజీనామాల షాకులు తగులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగునున్న కీలక తరుణంలో పలువురు కీలక నాయకులు టీడీపీని వీడుతూ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో పార్టీ సంస్థాగతంగా బలహీన పడుతుండడం టీడీపీ శ్రేణులను కలవర పెడుతుంది. తాజాగా టీడీపీలో కీలక నాయకుడైన లింగమనేని శివరామ ప్రసాద్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
గతంలో రుషికొండపై ప్రభుత్వం నిర్మిస్తున్న నిర్మాణాలు అక్రమమంటూ లింగమనేని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రుషికొండ నిర్మాణాల అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజాగా లింగమనేని శివరామ ప్రసాద్ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో టీడీపీకి పెద్ద షాక్ తగిలినట్లయింది.
గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు.
మార్చి 29, 1982న హైదరాబాద్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అన్న నందమూరి తారక రామారావు గారి స్పూర్తితో తెలుగుదేశం పార్టీతో నాకు ఏర్పడిన సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యక్తిగత కారణాలతో నేను పార్టీ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి (36460216) రాజీనామా చేస్తున్నాను. ఇంతకాలం తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు, శ్రీ నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ, వెంటనే నా రాజీనామాను ఆమోదించ వలసిందిగా కోరుచున్నానని రాజీనామా లేఖలో లింగమనేని వెల్లడించారు.