ఉదయగిరి టీడీపీలో సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నా కేవలం వందల కోట్లు ఖర్చు చేస్తారు అని ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ కు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే కాకర్ల సురేష్ ఒంటెద్దు పోకడలతో ఉదయగిరి సీనియర్ టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. కాకర్ల దురుసు ప్రవర్తనకు నొచ్చుకొని ప్రచారానికి దూరంగా మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకట రామారావు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకుడు కంభం విజయరామి రెడ్డి అందరూ కలిసి కట్టుగా దూరంగా ఉన్నారు. […]
‘పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశా. డబ్బు ఖర్చు పెట్టా. అయినా నాకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారు. చంద్రబాబు నాయుడు చెప్పినా సరే కాకర్ల సురేష్‌కు నేను సహకరించను’ బొల్లినేని వెంకటరామారావు ధోరణి ఇది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు హాట్‌హాట్‌గా ఉన్నాయి. బొల్లినేని, సురేష్ వర్గాల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. అంతా సర్దుకుంటుందని కేడర్ భావిస్తున్నా.. ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇటీవల చంద్రబాబు వింజమూరులొ ప్రజాగళం సభ […]
మీరు ఎన్ఆర్ఐ అయ్యి ఉండి.. బాగా డబ్బు ఉంటే చాలు.. తెలుగుదేశంలో సంవత్సరాలుగా పనిచేయకపోయినా చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చేస్తారు. ఆయనకు కావాల్సిన మొత్తం ఇస్తే.. సీటు ఇవ్వడానికి ఎంతటి సీనియర్‌ను అయినా బలి చేస్తారు. ఎన్నికలంటే చాలు.. టీడీపీలో ఎన్ఆర్ఐలు చేరేస్తారు. అందులోనూ ఓ సామాజికవర్గం వారే అధికంగా ఉంటారు. షెడ్యూల్‌కు రెండు, మూడునెలల ముందు వచ్చేస్తారు. పార్టీకి దండిగా ఫండ్ ఇస్తారు. అధినేతల ఖజానాకు ఎంతోకొంత వితరణ చేస్తారు. టార్గెట్ చేసిన నియోజకవర్గంలో ట్రస్ట్ […]