వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారనే అక్కసుతో బీసీ మహిళల ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడులకు తెగబడ్డారు. మహిళలు పిల్లలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా ప్రవర్తించి ఉన్మాదం చూపించారు.
పల్నాడులో టీడీపీ మరోసారి రెచ్చిపోయింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారనే అక్కసుతో బీసీ మహిళల ఇళ్లపై టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడులకు తెగబడ్డారు. మహిళలు పిల్లలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా ప్రవర్తించి ఉన్మాదం చూపించారు. వివరాల్లోకి వెళితే నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు వైసీపీకి పూర్తి స్థాయిలో మద్దతు పలకడాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం నాయకులు పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో నేడు బీసీల ఇళ్ళపైకి దాడులకు దిగారు. బీసీ మహిళల ఇళ్లను, ఇంటిలోని సామగ్రిని, బైక్‌లు, ఆటోలను పూర్తిగా ధ్వంసం చేశారు.
టీడీపీ చేస్తున్న దాడులకి తీవ్ర భయాందోళనకు గురైన సదరు మహిళలు ఇళ్ళు వదిలి ఓ గుడిసెలో తలదాచుకున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ దాడులు చేస్తున్న విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు కాసు మహేష్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ బాధితులను పరామర్శించేందుకు కొత్తగణేషునిపాడుకు వెళ్లారు. టీడీపీ వారు ధ్వంసం చేసిన ఇళ్ళను పరిశీలించి బాధితులను ఓదార్చే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న టీడీపి గూండాలు కాసు మహేష్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్‌పై దాడికి దిగారు. పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
కొత్తగణేషునిపాడులో టీడీపీ నేతల ఉన్మాదంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మంత్రి అంబటి రాంబాబు, వైసీపి లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు పత్రం అందజేశారు. టీడీపీ దాడులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.