అతను విశాఖ పశ్చిమ నియోజకవర్గము నుండి టీడీపీపార్టీ తరుపున వరుసగా రెండు సార్లు భారీ మెజార్టీ తో విజయం సాధించిన ఎమ్మెల్యే. ఈసారి తనకు గెలుపుపై ఆశలు సన్నగిల్లడంతో తన పార్టీ అనుచరులతో నాలుగు బ్యాచ్ లను తయారు చేసి నియోజకవర్గంలో వున్న వ్యాపార వర్గాలను బెదిరించి ఒకవైపు డబ్బులను వసూలు చెయ్యడం మరో వైపు తనకు అనుకూలంగా పని చేసేలా బెదిరించడం చేస్తూ వ్యాపార వర్గాలను వాణికిస్తున్నాడు ఆయనే టీడీపీ ఎమ్మెల్యే గణబాబు.
ప్రచారం పేరుతో టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వస్తున్నాడు అంటే చిరు వ్యాపారులు, బడా పారిశ్రామిక వేత్తలు భయంతో వాణికిపోతున్నారు. ఇక తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసే వారు అయితే బిక్కు బిక్కుమంటూ హడలిపోతున్నారు. మరో వైపు వైసీపీ అభ్యర్థి అడారి అనంద్ అందరిని నవ్వుతూ పలకరిస్తూ ప్రేమతో కలుపుకు పోతుంటే గణబాబు మాత్రం బెదిరింపులతో దడ పుట్టిస్తున్నాడు. గణబాబు తన అనుచరులను మొత్తం నాలుగు బ్యాచ్ లుగా విభజించి ఒక బ్యాచ్ బంగారు వ్యాపారులను బెదిరించడానికి, మరో బ్యాచ్ వస్త్ర వ్యాపారులను బెదిరించడానికి, మరో బ్యాచ్ కిరాణా వ్యాపారులను బెదిరించడానికి, మిగిలిన బ్యాచ్ చిరు వ్యాపారులను, ఇతర వర్గాలను బెదిరించిడానికి తయారు చేసి వదిలాడు.
వ్యాపార వర్గాల అధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను ఇంటికి పిలిపించుకొని తిడుతూ బెదిరించడం చేస్తూ వసూళ్లకు తెరలేపారు. దీనితో అందరూ కలిసి వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ దగ్గరకు చేరి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆనంద్ అందరికి అభయమిస్తూ నేను మీకు అండగా వుంటాను ఎవరైనా బెదిరిస్తే వెంటనే తనకు తెలియచేస్తే మీ ముందుకు వస్తాను అంటూ అభయమిస్తున్నారు.
ఇప్పటికే తన మంచి తనం , దాన గుణం తో ఆడారి ఆనంద్ అందరివాడు అనిపించుకొంటుంటే , గుణం వదిలేసిన గణబాబు మాత్రం ఇప్పటికే నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని కోల్పోయి ఇప్పుడు బెదిరింపులతో మరింత అప్రతిష్ట పలవుతున్నారు అని అటూ ప్రజలు ఇటు రాజకీయ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.