టీడీపీలో టిక్కెట్లు దక్కని అభ్యర్థుల నిరసనలు తారాస్థాయికి చేరాయి. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ టీడీపీ టికెట్‌ను ఆశించి తనకు రాలేదనే మనోవేదనతో నియోజకవర్గ ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్ మహబూబ్‌నగర్ జిల్లాలో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఎంతో ఆశతో ఉన్న ఆయనకు టికెట్ దక్కకపోవడంతో , తీవ్ర అసంతృప్తికి లోనై న ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.
టీడీపీ తొలి జాబితాలో ఊహించని విధంగా కోడుమూరు టీడీపీ టికెట్‌ను బొగ్గుల దస్తగిరికి కేటాయించిన్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఆ సంధర్భంగా కర్నూలులో ఆకెపోగు ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని జెండాను మోసిన తనకు టికెట్‌ను ఎందుకు నిరాకరించారని అధిష్టానాన్ని నిలదీస్తూ ఎలాంటి కార్యక్రమాలు చేయలేని బొగ్గుల దస్తగిరికి ఏ నాయకుడు ఒత్తిడితో టికెట్ కేటాయించారని ఆయన మండిపడ్డారు. తనకు టికెట్ రాకపోవడంతో 30ఏళ్ల కష్టానికి ఏమి న్యాయం జరి గిందని ప్రశ్నిస్తూ కుటుంబంతో సహా ఆత్మహత్యకి పాల్పడుతామని హెచ్చరించారు.
అయితే మీడియాతో అన్నట్లుగానే ఆకెపోగు ప్రభాకర్ పురుగుల మందు సేవించి ఆత్యహత్యయత్నానికి పాల్పడంతో మహబూబ్ నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించడంతో వైద్యల పర్యవేక్షణలో ఉన్నారు. పార్టీ కోసం నిరం తరం పనిచేసిన వ్యక్తికి పార్టీ ఇచ్చిన గుర్తు ఇదేనా అని ఆకెపోగు భార్య టీడీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. పలువురు టీడీపీ నాయకులు ఆకెపోగును