2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రకటనల్లో మునిగి తేలుతున్నాయి, ఈ విషయంలో అధికార వైసీపీమిగతా అన్ని పార్టీల కన్నా ముందుందని చెప్పొచ్చు, మరోవైపు అధికార వైసీపీలోకి వలసలు ఊపుందుకున్నాయి.ఈ సందర్భంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి బీజెపీ టీడీపీ జనసేన పార్టీల నుంచి కీలక నేతలు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర క్యూ కట్టారు. ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరడానికి ఉండి మాజీ శాసన సభ్యులు శివ రామ రాజు సీఎం క్యాంపు ఆఫీస్ కి రానున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజక వర్గానికి చెందిన టీడీపీ మాజీ శాసనసభ్యుడు మంతెన శివరామరాజు వైఎస్సార్సీపీలో జాయిన్ కావడానికి సిద్ధం అయ్యారు. చంద్రబాబు ఉండి నియోజక వర్గ శాసనసభ అభ్యర్థిని ప్రకటించేటప్పుడు తన నిర్ణయం ఏంటో తెలుసుకోకుండా ప్రకటించడం చాల బాధాకరమని సన్నిహితులతో వాపోయారని సమాచారం. ఈ రోజు శివరామరాజు తో మొదలు వైస్సార్సీపీలోకి వరుస చేరికలు ఉన్నాయి. రేపు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు కూడా జగన్ సమక్షం లో పార్టీలోకి జాయిన్ అవ్వడానికి సిద్ధం అయ్యారు. తుని టికెట్ ఆశించిన యనమల కృష్ణుడు ఆ టికెట్ తన అన్న కుమార్తె యనమల దివ్యకు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు, ఎల్లుండి రాయచోటి టీడీపీ మాజీ ఇంచార్జి రమేష్ రెడ్డి జాయిన్ కానున్నారు, కష్టకాలంలో ఉన్న టీడీపీ పార్టీ వెంట నడిచిన తనను కాదు అని వేరే ఎవరికో టికెట్ ఇవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రమేష్ రెడ్డి .
ఆ రోజే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీ లో చేరనున్నారు. ముద్రగడ ఈ రోజే పార్టీలో చేరాల్సి ఉన్న వేరే ఇతర కారణాలు చేత ఎల్లుండి జగన్ సమక్షంలో వైస్సార్సీపీ లో జాయిన్ అవుతా అని ఇప్పటికే ప్రకటన చేసారు. ఈ రోజు టీడీపీ తన రెండో జాబితా ప్రకటన చేసిన నేపథ్యంలో ఇంకా ఎంతమంది నాయకులు వైఎస్సార్సీపీలో జాయిన్ అవ్వడానికి తయారు అవుతారో వేచి చూడాలి .