మళ్ళీ రచ్ఛకెక్కిన టీడీపీ – జనసేన గొడవలు.. ఈసారి ఎక్కడంటే?
టీడీపీ జనసేన పొత్తు ఖరారు అయ్యి 4 నెలల అవుతున్నా రాష్ట్ర స్థాయి నాయకులు కలిసి సభలు నిర్వహిస్తున్న, నియోజక వర్గ స్థాయిలోని కార్యకర్తలు కలిసి పని చేయలేని పరిస్థితి, టికెట్ల ప్రకటించక ముందే ఇలా ఉంటే ప్రకటించిన తర్వాత ఇంక ఏ రకంగా ఉంటుందో చూడాలి.
మొన్న తెనాలి, నిన్న భీమవరం, నేడు కాకినాడ ఇలా వరుసబెట్టి అన్ని ప్రదేశాల్లో టీడీపీ జనసేన మధ్య గొడవలు రచ్చకెక్కుతున్నాయి. ఈ రోజులు కాకినాడలో జనసేన వాళ్ళు తమ పార్టీ కార్యాలయం ప్రారంభించారు, పార్టీ కార్యాలయ ప్రారంభానికి టీడీపీ వాళ్ళకు జనసేన ఆహ్వానం పలకలేదు. కాగా ఇక్కడ ఎవరు పోటీ చేస్తారు అనే విషయం ఇంకా క్లారిటీ లేదు అంతలోనే జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం పై తెలుగు తమ్ముళ్లు గొడవ చేశారు. టికెట్ అనౌన్స్ చేయకుండా పార్టీ ఆఫీస్ ఓపెన్ ఎలా చేస్తారు అంటూ ప్రశ్నించడమే కాక రెండు చోట్ల ఓడినోడు మాకేం ఉపయోగపడతాడు అంటూ జనసేనానిని దూషించారు కొందరు టీడీపీ నేతలు .
టీడీపీ జనసేన పొత్తు ఖరారు అయ్యి 4 నెలల అవుతున్నా రాష్ట్ర స్థాయి నాయకులు కలిసి సభలు నిర్వహిస్తున్న, నియోజక వర్గ స్థాయిలోని కార్యకర్తలు కలిసి పని చేయలేని పరిస్థితి, టికెట్ల ప్రకటించక ముందే ఇలా ఉంటే ప్రకటించిన తర్వాత ఇంక ఏ రకంగా ఉంటుందో చూడాలి. నిన్న భీమవరం పర్యటనకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ టీడీపీ కార్యకర్తలు అందరినీ కలుస్తా అని మీటింగ్ ఏర్పాటు చేసి, టీడీపీ అభ్యర్థిని, ముఖ్య నాయకులు కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, పవన్ కళ్యాణ్ చేసిన ఈ పనిని టీడీపీ కార్యకర్తలు బహిరంగంగానే పవన్ కళ్యాణ్ ను దుయ్యబట్టారు, రమ్మని మాట్లాడకుండా పోవడం ఏంటి అని. ఇలా వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుందో .