ప్రజలకు మంచి చెయ్యాలన్న ఆలోచన ముందుగా చంద్రబాబుకు ఎప్పుడూ రాదు.. ఎవరో పెట్టిన పధకాలు కాపీ కొట్టడం లేకపోతే ఆల్రెడీ ఉన్న పధకాలకు పేరు మార్చడం తప్ప.. కొత్తగా విప్లవాత్మకంగా చంద్రబాబు తెచ్చిన ప్రజలకు మేలు జరిగిన కార్యక్రమాలు అసలు లేవు. టీవీలు, సెల్ ఫోన్లు కనిపెట్టానంటూ ఎర్రగడ్డ మాటలు మాట్లాడే బాబుకు వ్యవసాయం దండగనిపిస్తుంది, ఇంగ్లీష్ మీడియం పిల్లలను మొద్దబ్బాయిలను చేస్తుందనిపిస్తుంది. కానీ వైఎస్సార్సీపీ ప్రకటించిన ప్రారంభించిన పధకాలకు పేరు మార్చి మేనిఫెస్టోలో పెట్టుకుంటాడు.
మే, 2023 లో 2024 ఎన్నికలకు సంబంధించిన మిని మేనిఫెస్టోని టీడీపీ రిలీజ్ చేసింది. మేనిఫెస్టోలో ఒక పార్ట్ అయిన అమ్మకు వందనం పధకంలో భాగంగా ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకొంటూ ఉంటే అంతమందికి 15000 చొప్పున తల్లి ఖాతాలో వేస్తారట. మహిళల కోసం ఆలోచించి చించి ఈ పధకం రూపొందించాడట.
2019 ఎన్నికలలో గెలిచిన జగన్, ఆ తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో అమలుచేస్తున్న పథకం అమ్మవడి . ఈ పధకం వల్ల ఎంతోమంది పేద తల్లీదండ్రుల కలలు నెరవేరాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావితరాల భవిష్యత్తును పదిలపరిచేందుకు ఎన్నో కలలతో ఎంతో వినూత్నంగా ప్రారంభించిన పథకం అమ్మ ఒడి.
విద్యలో సమూల మార్పులు తీసుకువచ్చిన దార్సనిక నేత వైఎస్ జగన్. అయితే వైఎస్సార్సీపీ అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకాన్ని “ అమ్మ ఒడి.. నాన్న బుడ్డి “ అంటూ అవహేళన చేశాడు చంద్రబాబు. మళ్ళీ అదే పథకాన్ని సిగ్గు లేకుండా అమ్మకు వందనం అని పేరు మార్చి మిని మేనిఫెస్టోలో పెట్టాడు. ఈ మధ్య లోకేష్ అరకొర అతి తెలివితో అమ్మకు వందనం లెక్కలు చెప్పి నవ్వులపాలయ్యాడు.
గతం చూస్తే 2014 లో అనుకోని అతిధిలా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక సంవత్సరం పరిపాలన పూర్తయ్యేసరికే అవుట్ డేటెడ్ ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నాడు. హంగు ఆర్భాటాలే కానీ మేనిఫెస్టోలో ఒక్క హామీని సక్రమంగా అమలుచేసిన పాపానపోలేదు. చంద్రబాబు పరిపాలనా కాలమంతా ఆ మేనిఫెస్టో కనపడకుండా జాగ్రత్తపడ్డారు. తరువాత 2019 ఎన్నికలకు మేనిఫెస్టోను రిలీజ్ చేశారు కానీ అందులోని పధకాలు 2017 లో వైఎస్ జగన్ రిలీజ్ చేసిన నవరత్నాలకు కాపీనే. ఎప్పటికప్పుడు చంద్రబాబు ఎవరో ఒకరి దగ్గర నుండి కాపీ కొట్టడం తప్పా సొంతంగా హామీ ఇచ్చిన పథకాలే లెవ్వు.
చంద్రబాబు నాయుడి రాజకీయ జీవితం ముగిసిపోయింది.
తరాల తరబడి రాజకీయాలు చేస్తే అనుభవం వస్తుందేమో కానీ ప్రస్థుత పరిస్థితులను అర్ధం చేసుకునే పరిజ్ఞానం రాదు. ప్రపంచంలో టెక్నాలజీ లేని సమయంలో కర్ణాటక, తమిళనాడు మేనిఫెస్టోలను పైకి కిందకి చేసి మేనిఫెస్టో తయారు చేస్తే నడిచిందేమో కానీ.. ఈరోజుల్లో కాపీలు కొడుతున్న డమ్మీ రాజకీయ నాయకులను టెక్నాలజీ ఇట్టే పట్టించేస్తుంది.