రైతు ద్రోహి, చంద్రబాబు ఇవి రెండు పర్యాయపదాలని గ్రామాల్లో ఒక నానుడి ఉండేది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో రైతులన్నా, రైతు విధానాలన్నా వాటికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించిన తీరు రాజకీయలపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరికి పరిచయమే .. అటువంటి చంద్రబాబు నేడు ప్రతిపక్షంలో ఉండి రైతులపై లేని ప్రేమను వొలకపోయడం గమనిస్తూనే ఉన్నాం.
చంద్రబాబు 1995లో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ నుండి కుర్చీ లాగేసుకుని సీఎం అయిన దగ్గర నుండి 2004 వరకు, మళ్ళీ 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉంటూ ఆయన రైతులపై వ్యవహరించిన తీరుని, వాడిన భాష గమనిస్తే ఆయన రైతుల పట్ల ఎంత వ్యతిరేకత ప్రదర్శిస్తారో తెలిసిపోతుంది. పైకి రైతులు, వారి కష్టాలు అంటూ మాట్లాడినా అవన్ని అధికారం కోసమే అనేది తెలియనది ఎవరికి. ఈ మధ్య నేను వ్యవసాయం దండగా అని ఎక్కడా అనలేదు దమ్ముంటే సాక్ష్యం చూపించండి , అంటూ సవాళ్ళు కూడా చేస్తున్నారు. చరిత్ర ప్రజలు మరిచిపోతారని ధీమా కాబోలు ..
1995లో ముఖ్యమంత్రి అయ్యాక రైతులని అన్న మాటలు చూస్తే “13 ఏప్రిల్ 1999:- వద్దన్నా వ్యవసాయం చేస్తున్నారు, ఒకసారి పంట ఎండిపోతే బుద్ది వస్తుంది.” “జులై 2002:- పంటలు ఎండిపోతే ఇక కరెంటు ఎందుకు?” “8 డిసెంబర్ 2022:- పేదలకు భూములు పంచితే పేదరికం పోతుందా?” అలాగే “ఉచిత కరెంటు ఇస్తే వాటిపై బట్టలు ఆరేసుకోవాల్సిందే.” “6 సెప్టెంబర్ 2003:- కరువుకు తుఫానే మందు (కారంచేడులో),” “మనసులో మాట పుస్తకంలో:- ప్రాజెక్టులు కడితే లాభంలేదు, అయ్యే ఖర్చు ఎక్కువ, పన్నుల రూపంలో వచ్చేది తక్కువ,” “13 ఫిబ్రవరీ 2000:- విద్యుత్ కోతలకి కారణం రైతులే (గుడివాడ బై ఎలెక్షన్ సభలో ),” “25 జనవరి 2016:- రైతులకి అత్యాశ పనికిరాదు” “25 జులై 2014:- 1.50 లక్షలకు పైబడి రుణం తీసుకున్న రైతులంతా దొంగలే” ఇదే వరవడిలో ఆయన అన్న మాట “డిసెంబర్ 1999:- వ్యవసాయం టైం వేస్ట్ (దండగ)” ఇవన్నీ శ్రీమాన్ చంద్రబాబు గారు రైతులపై పేల్చిన డైలాగులే.
భారతదేశం వ్యవసాయపరంగా ముఖ్యమైన దేశం. జనాభాలో 58% మంది జీవనోపాధి కోసం ప్రత్యక్ష వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం ఇంత ప్రాముఖ్యమైన దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు మాదిరి మాట్లాడి రైతులని అవమానించిన చరిత్ర లేదు. ప్రతిపక్షంలో ఉంటే రైతులపై ప్రేమలు చూపించే చంద్రబాబుకు అధికారం రాగానే ఆయనలోని రైతు వ్యతిరేకి బయటికి వస్తాడు. వారిని బెదిరిస్తారు, వారికి ఇచ్చిన హామీలని గాలికి వదిలేస్తారు. ఇవన్నీ చరిత్ర చెబుతున్న సత్యాలే.
ఒక్కసారి నోటి నుండి వచ్చిన మాటని మంచైనా చెడైనా మోయాల్సిందే .. జై జవాన్ జై కిసాన్ అనే నినాదానికి భారతదేశంలో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిసిందే. 1965 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధంలో సమయంలో ఆహార కొరత నేపథ్యంలో సైనికులు మరియు రైతుల మనోధైర్యాన్ని పెంపొందించడానికి లాల్ బహుద్దుర్ శాస్త్రి గారు ఈ ప్రసిద్ధ నినాదాన్ని ఇచ్చారు. ఇది నాడు దేశ ప్రజలకి ముఖ్యంగా రైతాంగానికి ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. ఇప్పటికి ప్రజలు ఆ మంచి మాటని గుర్తుంచుకున్నారు. అలాగే చంద్రబాబు వ్యవసాయం టైం వేస్ట్ ( దండగ ) అన్న చెడు మాటని కూడా గుర్తుంచుకున్నారు. చంద్రబాబు ఈ మాటని ఆయన జీవితాంతం మోయాల్సిందే…