ఎన్నికల ప్రచారంలో గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత దూసుకుపోతున్నారు. నిన్నటి వరకు కొవ్వూరు ఎమ్మెల్యే గా పోటి చేసి గెలిచిన తానేటి వనిత ఇప్పుడు తన సొంత నియోజకవర్గం అయిన గోపాలపురం నుండి పోటీ చేయబోతున్నారు. అభ్యర్థిగా ప్రకటించి రెండు నెలలు కూడా పూర్తి కాకముందే నియోజకవర్గంలోని నాలుగు మండలాలు చుట్టి వచ్చారు. మొత్తం 80 గ్రామాలు ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. జగన్ గారు చేసిన సంక్షేమం, అభివృద్ది పనులను ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్ళారు. ఇప్పటికే నియోజకవర్గంలో వైసీపీ బలంగాఉన్న నేపథ్యంలో ఇప్పుడు తానేటి వనిత తన తండ్రి పరిచయాలతో పాటు తన కుటుంబ సభ్యుల అండతో నియోజకవర్గం మొత్తం సుడిగాలిలా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు.
ఇప్పటికే సోషల్ మీడియా మీటింగ్ ఏర్పాటు చేసి వారిని ఉపయోగించుకుంటున్నారు. అలాగే వివిధ సామాజిక వర్గాలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి దిశ నిర్దేశం చేశారు. టీడీపీ, జనసేన కు చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి వైసీపీ లో జాయిన్ అయ్యారు వారితో వైసీపీ పార్టీ లో జోష్ పెరిగింది.
ఇక ఈ నియోజకవర్గంలో టీడీపీ రెండు గ్రూపులుగా విడిపోయి చివరకు చంద్రబాబు ఎదుటే గొడవపడి కొట్టుకొనే పరిస్థితికి వచ్చాయి. గోపాలపురం టీడీపీలో మొన్నటి వరకు ముప్పిడి వెంకటేశ్వర రావు ఇంచార్జీ గా వుండేవారు అయితే చంద్రబాబు నాయుడు ముప్పిడి ఎలక్షన్ లో ఖర్చు పెట్టలేడని భావించి బాబు సామాజిక వర్గం అండ దండలు, డబ్బులున్న మద్దిపాటి వెంకట్రాజు కు టికెట్ ఇచ్చారు. ఇక్కడ నుంచే టీడీపీలో వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరి రెండు వర్గాలు ఎదురెదురు పడితే కొట్టుకొనే వరకు వచ్చింది. ముప్పిడికి మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ మధ్యనే ఎన్నికల ప్రచారంలో వచ్చిన చంద్రబాబు ఎదుట పెద్ద ఎత్తున గొడవకు దిగారు. కానీ చంద్రబాబు మద్దిపాటి వెంకట్రాజు కే టికెట్ అని చెప్పి జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. నియోజకవర్గ ప్రచారంలో ముప్పిడి , మద్దిపాటి వర్గాలు ఎడ మొఖం పెడ మొఖం వుంటూ తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో టీడీపీ గ్రూప్ తగాదాలు పడుతూ లేస్తూ ఉంటే వైసీపీ అభ్యర్థి అయిన తానేటి వనిత సుడిగాలి పర్యటనలతో దూసుకుపోతున్నారు.