ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్య విధానంలో పెను సంచలన మార్పులు చేపట్టిన విషయం విదితమే. ఆంధ్ర రాష్ట్రములో విద్యా వ్యవస్థలో ఏఏ మార్పులు తీసుకొచ్చారు. వాటిని అమలు ఎలా పరుస్తున్నారు , ఇవే పథకాలను తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఆ రాష్ట్ర సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. ఆరతి , వారి బృందం శుక్రవారం తిరుపతి జిల్లా రేణిగుంట జిల్లా బాలికోన్నత పాఠశాలలో పర్యటించారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు పరుస్తున్న నాడు నేడులో భాగంగా పాఠశాలల రూపు రేఖలు మార్చడం,మౌలిక వసతులు ఏర్పాటు చేయడం, అధునాతన క్లాస్ రూమ్స్ , నూతన ఆవిష్కరణలు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీను పాఠశాల స్థాయికి తీసుకొని వచ్చి అమలు చేస్తున్న తీరు, ఇంటరాక్టివ్ ప్యానెల్ ద్వారా క్లాసులు నిర్వహించడం, స్మార్ట్ క్లాస్ రూమ్ విధానం, ప్రొజెక్టర్ పైన క్లాసులు చెప్పడం, ఉచితంగా బైజూస్ ట్యాబ్ , సిబీఎస్ఈ సిలబస్ ను తీసుకురావడం , మధ్యాహ్నం పౌష్ఠిక ఆహారంతో భోజనం ఏర్పాటు చేయడం, పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్ వినియోగం, నవరత్నాలు, విద్యాకానుక, క్వాలిటీ వాల్, బైలింగ్వల్ టెక్స్ట్ పుస్తకాలు, స్వేచ్ఛ, టోఫెల్, ఈ మధ్యనే తీసుకొని వస్తున్న ఐబీ విధానం గురుంచి పూర్తి స్థాయిలో మన రాష్ట్ర సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తమిళనాడు బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు స్టేట్ డైరెక్టర్ రామకృష్ణాన్, స్టేట్ కో ఆర్డినేటర్ వడివేలు, తిరుపతి జిల్లా డీఈఓ శేఖర్ , రేణుగుంట మండల్ ఎంఈఓ , ప్రిన్సిపాల్ , ఐటి సెల్ సభ్యులు తదితురాలు పాల్గొన్నారు.