ఏపీలో ప్రశాంతమైన అనకాపల్లి లో చంద్రబాబు అనుచరుడు సీఎం రమేష్ అనుచరుల ఆగడాలు రోజు రోజుకీ మితిమీరిపోతున్నాయి. ఇటీవలే టైల్స్ షాపులో తనిఖీకి వెళ్ళిన అధికారులను, పోలీసులను అడ్డుకొని సీఎం రమేష్ నానా రభస చేసినా విషయం విదితమే ఇప్పుడు తన ప్రత్యర్థి వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడి హత్యకు కుట్రలు చేస్తూ దొరికిపోయారు. ఇప్పుడు ఇదే అనకాపల్లి జిల్లాలో తీవ్ర అలజడికి కారణం అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలోని తరువు గ్రామంలో డిప్యూటీ సిఎం, అనకాపల్లి వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడి సొంత ఇంటి మీద డ్రోన్లతో వీడియోలు తీస్తూ ఉండటంతో అనుమానం వచ్చిన వైసీపీ కార్యకర్తలు ముత్యాలనాయుడికి సమాచారం అందించారు. ఎవరైనా పోలీసులు వీడియో తీస్తున్నారని మొదట భావించినా, ముప్పై నిమిషాల పైనే వీడియోలు తీస్తూ వచ్చి పోయే రోడ్లను కూడా వీడియో తిస్తుండే సరికి అనుమనం వచ్చి అనుమానాస్పదంగా డ్రోన్ లతో వీడియోలు తీస్తున్నారని మొదట పోలీసులకు సమాచారం అందించి గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు .
గ్రామ ప్రజలు డ్రోన్ ఆపరేట్ చేస్తున్న పాండురంగను పట్టుకొని అడగ్గా మాకు సంబంధం లేదు సీఎం రమేష్ చెయ్యమన్నారని జవాబు ఇచ్చారు. పర్మిషన్ కాగితాలు అడిగితే మాకు ఏమి తెలియదు సీఎం రమేష్ తీయ్యమన్నారు అని ఒకటే సమధానం ఇచ్చారు. అంతే కాకుండ మీరు ఎక్కడివారు అని అడిగితే మాది హైదరబాద్ అని చెప్పి కారులో పారిపోవడానికి ప్రయత్నించారు. ఆ కారు కూడా తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉండేసరికి గ్రామ ప్రజలు ఆగ్రహంతో వారిని కట్టి పడేశారు. అనంతరం పోలీసులకి అప్పగించి ముత్యాలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీని తరువాత సీఎం రమేష్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని రచ్చ చేసి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడి ఊరుకు వెళ్తా అంటూ తన అనుచరులతో వందల కార్లతో బయలు దేరి ఊరిలోకి అడుగు పెట్టిన రమేష్ వాహనాన్ని గ్రామ ప్రజలు అడ్డుకొని హత్యకు కుట్ర చేసి తిరిగి రెచ్చగొట్టడానికి ఊరిలోకి ఎలా వస్తావంటూ అడ్డం తిరిగారు. వారి మీదా సీఎం రమేష్ అనుచరులు దాడి చెయ్యడంతో ఒక్కసారిగా గ్రామ ప్రజలు సీఎం రమేష్ అనుచరులను తరిమికొట్టి వారి వాహనాలను ద్వంసం చేశారు. చివరకు పోలీసులు వచ్చి రమేష్ ను జాగ్రత్తగా అక్కడి నుండి తీసుకెళ్ళిపోయారు.
ప్రశాంతమైన అనకాపల్లిలో తన గూండాగిరితో ఎలాగైనా గెలవాలని సీఎం రమేష్ గొడవలకు ఆజ్యం పోస్తున్నారు. తన డబ్బు సంచులతో ప్రజలను రెండు వర్గాలుగా చీలుస్తూ వారి మధ్య గొడవలు సృష్టించారు. ప్రశాంతమైన అనకాపల్లిని నాశనం చేస్తున్న సీఎం రమేష్ తీరును ప్రజలు చీ కొడుతూ మరొక సారి అనకాపల్లి వైపు కన్నెత్తి చూడకుండా తమ ఓటుతో తరిమి తరిమి కొడతాం అంటూ మాట్లాడుకుంటున్నారు.