ఏపీ బీజేపీలో జరిగే వింతలు దేశంలో మరెక్కడా జరగవు అని మరొకసారి రుజువు అయ్యింది. ఏపీ బీజేపీనాయకుడు సుజనా చౌదరి తన కోవర్ట్ రాజకీయంతో ప్రజల చర్చలోకి వచ్చారు. ఇప్పటికే టీడీపీ మ్యానిఫెస్టోకి మాకు సంబంధం లేదని కేంద్ర బీజేపీ, రాష్ట్ర బీజేపీ చెప్పడం మనకందరికీ తెలిసిందే . ఆ టీడీపీ మ్యానిఫెస్టో లో బీజేపీ అగ్రనాయకుల ఫొటో లేదు , సింబల్ లేదు . అంతే కాకుండా టీడీపీ జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోనీ బీజేపీ పరిశీలకుడు కనీసం చేతితో తాకడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటి టీడీపీ మ్యానిఫెస్టోలోని అంశాలను తీసుకొని సుజనా చౌదరి ప్రచారం చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కారు.
బీజేపీ తమ ప్రతి సభలో అలాగే ప్రతీ మీడియా సమావేశంలో చెబుతూ వస్తున్న అత్యంత కీలక అంశం మేము అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ తిసేస్తామనే హామీని ప్రచారం చెయ్యకుండా టీడీపీ మ్యానిఫెస్టోలోని ఇమామ్ లకు పదివేలు మౌజమ్ లకు 5 వేలు గౌరవ వేతనం అనే హామీని విపరీతంగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే తన ప్రచారం లో ఎక్కడ బీజేపీ అగ్రనాయకులు మోదీ, అమిత్ షా ఫోటోలను వాడటం లేదు . ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. సుజన చౌదరి ఎక్కడ ఉన్నా టీడీపీ కోసం చంద్రబాబు కోసం పని చేస్తారు అనే నానుడిని నిజం చేస్తూ కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోటోలతోనే ప్రచారం చేస్తూ బీజేపీ నాయకులు మోదీ, అమిత్ షా లాంటి వారి ఫోటోలు కూడా పెట్టడం లేదు.
దీనకి కారణం ఏమిటి అంటూ బిజెపి , టీడీపీ ఆరా తీయగా మోదీ, అమిత్ షా ఫోటోలు పెడితే పడే నాలుగు ఓట్లు కూడా పడవు అందుకే పెట్టడం లేదు. అలాగే నా రాజకీయ గురువు చంద్రబాబు కాబట్టి తన ఫొటోతోనే ప్రచారానికి వెళ్తున్నాడు అనే విషయం బయటపడింది. దీనితో సుజనా చౌదరి ఎక్కడ వున్న బాబు మనిషే, ఇప్పుడు బీజేపీలో ఉంటూ కోవర్ట్ రాజకీయాలు చేస్తున్నాడని విజయవాడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు