మాజీ మంత్రి, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. ఈయనకు అబద్ధాలు చెప్పడమే పని. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలపై బురద వేస్తూనే ఉంటారు. ఏదో నోటికొచ్చేంది చెప్పేస్తాడు. ఎల్లో మీడియా రాసేస్తుంది. అందులో అర శాతం కూడా నిజం ఉండదు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్న కృష్ణపట్నం పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోతాయని ఊదరగొట్టాడు. కానీ అలా జరగలేదు. తన రాజకీయ ప్రత్యర్థి, సర్వేపల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై సోమిరెడ్డి ఎంతో దుష్ప్రచారం చేశారు. అయితే అవన్నీ తప్పులన్నీ చాలాసార్లు తేలిపోయింది. కాగా రెండేళ్ల నుంచి ఫైళ్ల దొంగ అంటున్నారు. కానీ కాకాణికి ఏకంగా సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది.
నెల్లూరు కోర్టులో ఏవో ఫైళ్లు దొంగతనం జరిగితే సోమిరెడ్డి కాకాణిపై రెచ్చిపోయారు. ఆయన తన కేసులకు సంబంధించిన ఫైళ్లను చోరీ చేయించారని ఆరోపించారు. దీనిపై రచ్చ రచ్చ చేశారు. చంద్రబాబు, టీడీపీ కూడా వంత పాడింది. దీంతో గోవర్ధన్‌రెడ్డి ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. తప్పు చేయలేదు కాబట్టి వెనుకంజ వేయకుండా సీబీఐ విచారణ చేయించాలని హైకోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలతో నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసును సీబీఐ ఏడాదిపాటు విచారించి తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో కాకాణి పాత్ర లేదేని స్పష్టం చేసింది. నేరం జరిగిన విధానంపై ఆయనకు అవగాహన లేదని వెల్లడించింది. దీంతో కాకాణిపై విరుచుకుపడిన వాళ్లంతా చివరికి తెల్లమొహాలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు మంత్రికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేల్చడమే కాకుండా నెల్లూరు పోలీసుల విచారణను సీబీఐ సమర్థించింది. వాళ్లు నిర్ధారించిన సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్‌ను దోషులుగానే పేర్కొంది. వారికి దొంగతనం చేయడం అలవాటేనని స్పష్టం చేసింది.
గెలవలేక..
ఎన్నికల్లో ఓడిపోవడం సోమిరెడ్డికి అలవాటుగా మారిపోయింది. ఇప్పటికే కాకాణి చేతిలో రెండుసార్లు ఓటమి చవిచూశారు. వరుసగా ఓడిపోతున్న వారికి టికెట్ ఇచ్చేది లేదని నారా లోకేశ్ గతంలోనే స్పష్టం చేశారు. దీంతో ఈ ఎన్నికల్లో టికెట్ రాదని సోమిరెడ్డి భయపడ్డారు. సీటు దక్కించుకోవాలంటే జగన్ సర్కారు, మంత్రులపై నిందలు వేయాలని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలో జగన్ మంత్రి వర్గంలోని కాకాణిపై ఫైళ్ల దొంగ అంటూ ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సీబీఐ క్లీన్చిట్ ఇవ్వడంతో ఏం చేస్తారో మరి.