1, ఎప్పటిలాగే తెల్లారింది. సైకిల్ పై వార్తా పత్రికలు తెచ్చి అరుగు దగ్గర ఇచ్చే కుర్రాడి మొహం ఎర్రబడి ఉంది. బాధని పల్లబిగువున మింగి పత్రికని అరుగు మీదున్న పెద్దాయనకి ఇచ్చాడు. ఏమైందిరా ఇంట్లో వాళ్ళు ఎవరో పోయినట్టు మొహం పెట్టావు అంటూ పేపర్ అందుకొన్న పెద్దాయన తెరిచి చూడగానే అయ్యో అంటూ చేతిలోని పత్రిక జారవిడిచాడు . మెయిన్ పేజీలోని వార్త అందరికీ కనబడింది.
ఆరు కోట్ల ఆంధ్రుల అన్న రామన్న ఇక లేరు
2, జీవన చరమాంకంలో తోడు నీడ కోసం ధర్మపత్నిగా స్వీకరించిన లక్ష్మిపార్వతి ఎన్టీఆర్ హటాన్మరణంతో దిగ్భ్రంతికి లోనయ్యి నన్ను కూడా మీతో తీసుకెళ్లండి అని విలపిస్తూ కుప్పకూలిపోయింది .
3, ఎన్టీఆర్ మరణించినప్పుడు విదేశీ యాత్రలో ఉన్న హరికృష్ణ హుటాహుటిన వచ్చి రావటంతోనే బోరుమనటమే కాక, అప్పటి వరకూ పక్కనున్న లక్ష్మి పార్వతిని, ఇతర ఎన్టీఆర్ వర్గ నాయకులని భౌతిక కాయం వద్ద నుంచి దూరం చేయటమే కాక నా తండ్రిని పాయిజాన్ తో చంపేశారు అని ఆరోపించటంతో దుఃఖపూరిత వాతావరణం ఒక్కసారిగా ఉద్విగ్నంగా మారిపోయింది.
4, ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి, మీద చెప్పులు వేయించి, పదవిని పార్టీని లాక్కుని క్షోభకి గురి చేసిన ఆయన అల్లుడు చంద్రబాబు ఎన్టీఆర్ ఇంటివద్దకు రాగానే ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ తో మిగిలి ఉన్న నాయకులు చంద్రబాబు రావటానికి వీళ్లేదంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఆయన పై చెప్పులు కూడా విసిరారు.
5, ఎన్టీఆర్ మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే ఆక్రసించిన అభిమానులు అందుకు కారకుడు అయిన చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ ప్లాంట్ల పై రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా దాడి ప్రయత్నాలు చేయడం నెల్లూరు జిల్లాలో రెండు హెరిటేజ్ వ్యాన్లను తగల బెట్టడంతో రాష్ట్రంలోని అన్ని హెరిటేజ్ కర్మాగారాల వద్ద పోలీసు బందోబస్తూ ఏర్పాటు చేశారు.
6, ఎన్టీఆర్ అంతిమ యాత్రలో కార్యక్రమాల నిర్వహణ పై ఎన్టీఆర్ వర్గానికి, బాబు వర్గానికి జరిగిన ఆధిపత్య పోరు, ఆయన ఆఖరి మజిలీ కూడా ప్రశాంతంగా జరగకుండా పలు అపశృతులకు, పలు వివాదాలకు వేదికగా మార్చి ఆయన అభిమానుల చీత్కారానికి గురయ్యారు .
7, ఎన్టీఆర్ మృతికి హరి, చంద్రబాబులే కారణమని వారు వెన్నుపోటు పొడిచి పదవి, పార్టీ, గుర్తులు లాక్కోవటం వలనే క్షోభకి గురయ్యి చనిపోయారని, తిరిగి వారే ఎన్టీఆర్ ని చంపేశారని ఆరోపిస్తున్నారని, దమ్ముంటే న్యాయ విచారణ జరపాలని ఎన్టీఆర్ వర్గ ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేశారు.
8, ఎన్టీఆర్ అంత్యక్రియలు జరుగుతుండగానే ఆయన ఇంటిలో పడక గదిలో ఉన్న డబ్బు, బంగారం కోసం ఎన్టీఆర్ బంధువులు, చంద్రబాబు వర్గంలోని ఎమ్మెల్యేలు పలువురు ఆ ఇంట్లోని లక్ష్మీపార్వతితో, ఇతర ఎన్టీఆర్ వర్గ నాయకులతో ఘర్షణ పడి దొరికిన కాడికి లాగేసుకొన్నారు. అంతటితో సంతృప్తి చెందక ఇదే అంశం పై పదే పదే వత్తిళ్ళు తేవడం, దౌర్జన్యాలు చేయడం జరిగాయి .
9, చంద్రబాబు వర్గం దాడులకు బెంబేలెత్తిన లక్ష్మీపార్వతి కోర్టుని ఆశ్రయించడంతో కేంద్ర రక్షణ బలగాలతో ఆమెకి రక్షణ కల్పించింది కోర్టు .
10, ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన మరణం వరకూ వెన్నంటి ఉన్న ఎన్టీఆర్ వర్గ ఎమ్మెల్యేలకు ఎన్టీఆర్ మరణించిన మూడు రోజులకే విషాద ఛాయలు వీడక ముందే గేలం వేసాడు చంద్రబాబు. పోయినాయన ఎటూ పోయాడు మనం కలిసి పని చేద్దాం అని వాళ్ళని తన వెన్నుపోటు వర్గంలో కలుపుకొనే ప్రయత్నం చేశాడు బాబు .
11, ఎన్టీఆర్ మృతి పై విచారణ జరిపించాలన్న హరికృష్ణ డిమాండ్ కి ఒప్పుకోని బాబు కేబినెట్ లో నిర్ణయం తీసుకొంటామని చెప్పి, విచారణ జరిపితే ఎన్టీఆర్ మృతి వెనక ఉన్న వాస్తవాలు మృతి చెందాక తన సూచనల మేరకు ఎన్టీఆర్ బాడీకి కెమికల్ కోటింగ్ వేయటం వెనక రహస్యాలు బయటకి వస్తాయన్న భయంతోనో మరో కారణం చేతనో విచారణ జరిపితే ఎన్టీఆర్ కి అవమానం అని కేబినెట్ చేత తీర్మాణం చేయించడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యిన హరి కృష్ణ తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
12, ఎన్టీఆర్ మృతి అనంతరం చెలరేగిన అంతర్గత వివాదాలన్ని కొంచెం తగ్గు ముఖం పట్టాక మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు, ఎన్టీఆర్ పేదల కోసం పని చేసిన దేవుడని ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తానని స్టేట్మెంట్ ఇవ్వడంతో నివ్వెర పోవడం ప్రజల వంతయింది.