రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కూటమి తరపున పోటీ చేస్తాడని ఇప్పటికే ఖరారైంది. పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వాన్ని మొదట టీడీపీ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ అంగీకరించలేదు. పవన్ కళ్యాణ్ పేరు ప్రకటన తర్వాత పిఠాపురం టీడీపీ నాయకులు నియోజవర్గంలో అల్లకల్లోలం చేశారు. నష్టాన్ని పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎస్విఎస్ఎన్ వర్మతో మాట్లాడి కూటమి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇస్తాం అనే హామీ ఇవ్వడంతో వర్మ, పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు. పవన్ కళ్యాణ్ తన పిఠాపురం పరిచయ వేదికలో నా భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్న అంటూ వర్మతో చెప్పడం గమనార్హం.
టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు మాటలు నమ్మి పవన్ కళ్యాణ్‌కి ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేసిన వర్మకి చేదు అనుభవం ఎదురైంది. పిఠాపురం నియోజవర్గంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయడానికి నీకు సిగ్గులేదా? అంటూ వర్మని తెలుగుదేశం కార్యకర్తలు బండబూతులు తిట్టారు . ఏం చేయాలో తెలీక వర్మ ఆ అవమానం తట్టుకోలేక వర్మ కారెక్కి వెళ్లిపోయారు. ఈ సంఘటన అనంతరం వర్మ పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.