ఎన్నికల నామినేషన్లు వేయడానికి రెండు రోజులు సమయం కూడా లేదు కూటమిలో సీట్లు పంచాయతీ ఇంకా తెగలేదు. కూటమి పొత్తులో భాగంగా టీడీపీ144, జనసేన 21, బీజెపీ 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. అభ్యర్థులు ఖరారు అయినప్పటికీ కూటమిలో సీట్లు రాని అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ముగిసేదాకా సీటు కోసం ప్రయత్నిస్తూనే ఉంటాము అని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
విశాఖ పార్లమెంట్ సీటు కోసం జీవీఎల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కూటమిలో భాగంగా ఇప్పటికే ఆ సీటు టిడిపి పార్టీకి చెందిన గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్, నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ కి సీట్ కేటాయించారు. సీట్ కేటాయింపు జరిగిన తర్వాత భరత్ ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతున్నాడు, కానీ విశాఖ పార్లమెంట్ సీట్ కోసం జీవీఎల్ ప్రయత్నాలు ఆపలేదు. ఇప్పుడు తాజాగా పారిశ్రామిక వేత్తలతో బిజెపి అధినాయకత్వానికి జీవీఎల్ విశాఖ అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నరసాపురం పార్లమెంట్ పరిధిలో కూడా సీట్ బిజెపికి చెందిన శ్రీనివాస్ వర్మ కేటాయించినప్పటికీ ఆ సీట్ కోసం రఘురామ కృష్ణంరాజు ప్రయత్నాలు చేస్తున్నాడు.
అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆ సీట్ ను బిజేపికి కేటాయించగా, అనపర్తి అసెంబ్లీ టిడిపికి చెందిన రామకృష్ణారెడ్డి ఆ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే కూటమి నేతల భేటీ అయ్యారు. ఒక వేళ టిడిపికి ఆ సీట్ కేటాయిస్తే బిజెపికి తంబాలపల్లి నియోజకవర్గం సీట్ ను బీజెపీ వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలా పైకి మూడు నాలుగు స్థానాలు కనిపిస్తున్న , మిగిలిన నియోజకవర్గాలలో ఒక పార్టీకి మరో పార్టీ వారు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు.