కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేసిందో తేలుద్దాం అని, జయప్రకాష్, పద్మనాభయ్య, IYR కృష్ణారావు, తోట చంద్ర శేఖర్ లతో ఓ కమిటీ ఏర్పాటు చేసి దానికి ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అని పేరు పెట్టి, TDP అధికారం లో ఉన్నప్పుడు కేంద్రం లో బీజేపీ తో పొత్తులో ఉండి, అక్కడ ఇక్కడ మంత్రులు ఉండి కూడా కేంద్రం న్యాయంగా రావాల్సిన 74,542 కోట్ల నిధులు ఇవ్వలేదు అని తీర్మానం చేసారు కదా?
ఆ లెక్కల ప్రకారమే పాచిపోయిన పాత లడ్డూ లాంటిది అని తమరు అన్న ప్యాకేజీ కింద రావాల్సిన 16,447 కోట్లు…
పన్ను విధానం వలన ఏర్పడిన నష్టాన్ని పూడ్చడానికి రావాల్సిన 3,820 కోట్లు..
రెవిన్యూ లోటు కింద రావాల్సిన 10,225 కోట్లు…
వెనుకబడిన ప్రాంతాలకు నీతి ఆయోగ్ సూచించిన 22,250 కోట్లు..
విశాఖ-చెన్నై కారిడార్ కి 6,000 కోట్లు..
కాకినాడ పెట్రో కాంప్లెక్స్ కి 5,000 కోట్లు…
జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థలకోసం ఇవ్వాల్సిన 10,800 కోట్లు….
మొత్తంగా 74,542 కోట్లు అని లెక్క తేల్చారు కదా?
మరి అవన్నీ వచ్చాయా?
రెవిన్యూ లోటు భర్తీ చేయాలని జగన్ మోహన్ రెడ్డి కోరగా వాటిని కేంద్రం విడుదల చేసింది.. జగన్ మోహన్ రెడ్డి కృషి వలన వైజాగ్ చెన్నై కారిడార్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. మీ పార్టనర్ సీఎం గా ఉన్నప్పుడు మొత్తంగా దానికై 306 కోట్లే ఖర్చు చేయగా జగన్ ప్రభుత్వం మొత్తంగా 2,278 కోట్లతో మొదటి దశ పనులు పూర్తి చేసి రెండో దశ పనులు కూడా ప్రారంభించింది… ఇక జీఎస్టీ నష్టం కింద రావాల్సిన నిధులను కూడా సాధించింది..
మరి 5 ఏళ్లలో బాబు ప్రభుత్వం సాధించింది ఏమిటి, ఇప్పుడు జగన్ సాధించుకు వస్తున్నా మీ కళ్లకు కనపడకపోవడంలో అర్ధం ఏమిటి? ఇప్పుడు బీజేపీ తో పొత్తుకోసం వెంపర్లాడి సాధించుకుంటున్న ఘనత ఏమిటి? బాబుకు చేతనవడం లేదనే మీ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్పింది కదా? మరి జగన్ సాధించి చూపెడుతున్నా మీ బాబే సీఎం కావాలని తమరు ఆరాట పడటంలో అర్థం ఏమిటి? ఇంతకీ బీజేపీ బాబు హాయంలో రాష్ట్రానికి చేసిన అన్యాయం ఏమిటి? జగన్ సీఎం గా ఉంటే బీజేపీ చేసిన న్యాయం ఏమిటి? బీజేపీ కరెక్టా? బాబు కరెక్టా? అసలు తమరి స్టాండ్ ఏమిటి పవన్ కల్యాణ్ గారూ, చిరకాలం బాబు సీఎం గా ఉండటమే మీ జీవితాశయమా? దానికోసం ఎందాకైనా దిగజారతారా?