ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జరిగే నైపుణ్య శిక్షణకి మెచ్చి , వాళ్ళు అవలభించిన ప్రణాళిక తీరును చూసి అన్నమయ్య జిల్లా నైపణ్యాభివృద్ధి సంస్థకు స్కోచ్ అవార్డ్ లభించింది అని సంస్థ చైర్మన్ అజయ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి జిల్లాను ఒక క్లస్టర్ గా తీసుకొని 26 జిల్లాల్లో 26 నైపుణ్య అభివృద్ధి సంస్థ లు ఏర్పాటు చేసి వాటితో పాటు ప్రతి జిల్లాలో ఒక స్కిల్ కాలేజ్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్దం చేసి ఆ వైపు అడుగులు వేగంగా వేస్తుంది ప్రభుత్వం. 26 స్కిల్ కాలేజ్ లతో పాటుగు గా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని 192 స్కిల్ హబ్ లు ఏర్పాటు చేశారు . ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం లో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేసి వాటి ద్వారా నిరుద్యోగ యువత కి ఎక్కడి వారికి అక్కడే ట్రైనింగ్ ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ఈ స్కిల్ హబ్ లు కృషి చేస్తున్నాయి.
అన్నమయ్య జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఒక స్కిల్ కాలేజ్, ఏడు స్కిల్ హబ్ లు, మూడు సీఎం స్కిల్ సెంటర్లు, మూడు డస్సల్ట్ స్కిల్ సెంటర్లు , రెండు సిమెన్స్ సెంటర్లు, ఆరు ఇంజనీరింగ్ కాలేజ్ లు , పాలిటెక్నిక్ కాలేజ్ లు, ఐటీఐ కాలేజ్ లు ఉన్న రాయచోటి యూనిట్ లో అన్నిట్లో స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించిన కోర్స్ లు ఏర్పాటు చేసి అక్కడికి అక్కడే ట్రైనింగ్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత జాబ్ మేళా లు నిర్వహించి తద్వారా ఇప్పటివరకు 07 జాబ్ మేళాలు, O7 మిని జాబ్ మేళా లు ద్వారా ఇప్పటి వరకు 1541 జాబ్స్ వచ్చాయి.
స్కిల్ ట్రైనింగ్ లో ఐటీ సెక్టార్ పైన కాకుండా , కన్స్ట్రక్షన్, రిటైల్, లాజిస్టిక్స్, ఆటోమోటివ్, అపరియల్, ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్, లైఫ్ సైన్సెస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ & ఇన్సూరెన్స్ , టూరిజం & హాస్పిటాలిటీ, ఐటీ & ఐటీఈస్ ఇలా ఇన్ని రంగాలలో నైపుణ్యం లో శిక్షణ ఇస్తారు.
Employment for every House Hold by 2029 అనే నినాదంతో అన్నమయ్య జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ముందుకు వెళ్తుంది.
స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అడ్డుపెట్టుకొని చంద్రబాబు చేసిన స్కిల్ స్కాం చూసి జైలు జీవితం కూడా అనుభవించడం చూసాం