అర్హత ఉండి కూడా పలు సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ వెల్లడించారు. ఇందులో భాగంగా అర్హత ఉన్నా ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందని లబ్దిదారులకు సీఎం జగన్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేశారు. ఈ కార్యక్రమం ద్వారా 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. పలు పథకాలు అందని వారికి లబ్ధి చేకూరుతుందని, ప్రతి 6 నెలలకోసారి ఈ నిధుల విడుదల కార్యక్రమం ఉంటుందని వలంటీర్లు స్వయంగా వెళ్లి లబ్ధిదారులతో దరఖాస్తులు పెట్టించాలని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.
ప్రతీ ఏడాది రెండు సార్లు అనగా జనవరి నుండి జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన లబ్దిదారులకు జూన్ మరియు జూలైలోనూ, అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్ మరియు జనవరిలో నెలలోనూ జగన్ ప్రభుత్వం సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను వారి ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు