వైఎస్ అకాల మరణంతో ఆగిపోయినా వారసుని ఆగమనంతో పూర్టైన నిర్మాణం
జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ నిర్మించదల్చిన సంగం బ్యారేజ్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభం అయింది.
వైఎస్ఆర్ అకాల మరణంతో నిలిచిపోయిన సంగం బ్యారేజ్ పనులు తర్వాత చంద్రబాబు హయాంలో గాలికి వదిలేశారు, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సింహపురి వాసుల చిరకాల కోరికైన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ పనులును త్వర తగితిన పూర్తి చేసుకొని రెండిటినీ ఒక రోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఒక వైపు కరోనా, మరో వైపు పలుసార్లు పెన్నా నది ఉగ్రరూపం దాల్చటం లాంటి అన్ని ప్రతికూలతలను ఎదురుకున్న జగన్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన మూడు సంవత్సరాలలో బ్యారేజ్ పనులు పూర్తి చేసింది.
సంగం బ్యారేజ్ ద్వారా జిల్లాలో 3.85 లక్షల ఎకరాలు ఆయకట్టు సస్యశ్యామలం కానుంది. సంగం పొదలకూరు మండలాల మధ్య శాశ్వత రాకపోకల సమస్య తీరిపోయింది. బ్యారేజ్ కమ్ రోడ్ నిర్మాణం ద్వారా వర్షాలు పడిన ప్రతిసారీ వరద ప్రభావం వల్ల అక్కడ ఉన్న పాత బ్రిడ్జి పైన ప్రయాణం చేయడానికి కుదరదు.1904 నుంచే బ్యారేజ్ కమ్ రోడ్ నిర్మించాలి అని ప్రతిపాదన ఉంది. బ్యారేజ్ ద్వారా సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువ కింద కోవూరుకి నీటి సరఫరా చేయనున్నారు. పెన్నా నది నిండితే నెల్లూరు కొవ్వూరు రాకపోకలు స్తంభించేవి, వరద ఉద్రిక్తత వల్ల ముందు ఉన్న బ్రిడ్జి ద్వారా నెల్లూరు టౌన్ ఒక భాగం నీటిలో మునిగిపోయింది. ఈ బ్యారేజ్ నిర్మాణం ద్వారా ఇలాంటి సమస్యలుకు అన్నిటికీ అడ్డుకట్ట వేశారు.
ప్రజల కోరిక మేరకు వైఎస్ఆర్ 2006, మే 28న ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు. 147.50 కోట్ల అంచనా వ్యయంతో 2008, మే 21న పనులు ప్రారంభించి 30.75 కోట్లు ఖర్చు చేసి పనులు వేగవంతంగా జరుగుతున్న సమయం లో వైఎస్ఆర్ అకాల మరణం చెందడంతో బ్యారేజ్ పనులు అక్కడికి అక్కడ నిలిచిపోయాయి . 2014 లోకి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హయాంలో 88 కోట్లు ఖర్చు అయితే చూపించారు కానీ బ్యారేజ్ లో ఎలాంటి పురోగతి లేదు. ఆ డబ్బులు అంతా కమిషన్లకే సరిపోయినట్లు ఉంది.సంగం బ్యారేజ్ నిర్మాణ వ్యయం 250 కోట్లు, 2008 నుంచి 2019 వరకు చేసిన ఖర్చు 117 కోట్లు, జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 133 కోట్లు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేసి 2022 , సెప్టెంబర్ 6న జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
బ్యారేజ్ నిర్మాణం ద్వారా నెల్లూర్, నెల్లూర్ రూరల్, కొవ్వూరు నియోజక వర్గాలలోనీ ముత్తుకూరు, టీపీ గూడూరు, వెంకటాచలం , ఇందుకూరుపేట మండలాలకు త్రాగు నీరు, 77 గ్రామాలలో 99525 ఎకరాల ఆయకట్టు కు సమృద్ధిగా నీటి సరఫరా జరగనుంది.ఈ బ్యారేజ్ లో నిత్యం 0.4 టీఎంసీ నీరు నిల్వ ఉంచడం ద్వారా నెల్లూర్ ,77 గ్రామాలకు శాశ్వత తాగునీటి పరిష్కారం దొరకనుంది.
బ్యారేజ్ పొడవు 1195 మీటర్లు కాగా , 79 స్పీల్ వే గేట్లు , 6 స్కాయర్ స్లూస్ గేట్లు అమర్చారు.7 లక్షల 50 వేల క్యూసెక్కుల వరదని తట్టుకునే సామర్థ్యంతో దీనిని నిర్మించారు.