మాచర్లలో ప్రజలు, అమాయక ఓటర్లపై టీడీపీ చేసిన దాడుల వీడియోలపై వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు, ఎన్నికల రోజు ఓటర్లపై దాడులు జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈసీ పక్షపాత వైఖరిపై ఆయన ప్రశ్నించారు, సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న వీడియోలలో టీడీపీ గూండాలే దాడులు చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది, దాని వెనుక ఎవరెవరు ఉన్నారో , దాడి వెనక ఉన్న వారిని ఎందుకు పట్టుకోలేకపోయారని ఎన్నికల కమిషన్కు సూటి ప్రశ్నలు సంధించారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయిగేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటించింది లేదు, ఆ వీడియో సరియైనది కాదో కూడా నిర్దారించకుండానే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?. ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో ఎన్నికల కమీషన్ ప్రమేయం లేకుండా సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది?
మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఈవీఎంలకు సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుంది ,అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ అయింది, ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయట పెట్టలేదు ?
అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే కదా ఆ సంఘటన తాలూకా పూర్తి విషయాలు బయటకు వచ్చేది, ఇవేమి బయటకు రాకుండానే ఒక చిన్న క్లిప్ ని అనుసరించి చేస్తున్న ఈసీ నిర్ణయాలు సరియైన పద్ధతిలో లేవు,13 న జరిగితే పోలింగ్ బూత్ లో ఘటన జరిగితే 21వ తేదీన వీడియో ఎలా బయటకు వచ్చింది? గుర్తు తెలియని వ్యక్తులని ఎలా ఫిర్యాదు చేయగలిగారు ?
స్వయంగా ఎమ్మెల్యే ఉంటే ఇంత గోప్యత ఎందుకు ? ఇన్నాళ్లూ టీడీపీ వాళ్లు గుర్తించలేదా ? పిన్నెల్లి అనుచరులు తమను బెదిరించారనే టీడీపీ వాదన నమ్మేలా ఉందా ? ఈ నెల 20న ఫిర్యాదు నమోదు అయ్యిందని ఈసీ వివరణ ఇచ్చింది అంటే..ఇంతకాలం సీఈవో ఆఫీస్ ఆ ఫుటేజీని చూడలేదా ? అసలు ఇంతకాలం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేశారు ? మిగతా వీడియోల సంగతి ఏంటి? అందులో ఎవరెవరు ప్రమేయముందని ఈసీ ఎందుకు దాస్తోందని ఎన్నికల కమీషన్ పక్షపాత వైఖరిపై ఆయన ధ్వజమెత్తారు