‘నా ఆఫీసు అమరావతి ట్విన్ టవర్స్‌లో ఉంది. దాని ముందు బుర్జ్ ఖలీఫా పనికిరాదు. చంద్రన్నలా ఠీవిగా నిలబడి ఉంటుంది. వందో అంతస్తులో ఉన్న మా కార్యాలయానికి రోజూ వెళ్లి వస్తుంటా. డే అంతా అక్కడే గడిపేస్తా. బాల్కనీ నుంచి చూస్తే ఆ సెక్రటేరియట్, బుల్లెట్ రైలు స్టేషన్, కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జిలు, ఆ పచ్చదనం.. చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. ఇక టవర్స్‌లో హోటళ్లు, మూవీ థియేటర్లు, బార్లు.. అబ్బో చాలా ఉంటాయిలే’ ఓ తెలుగు తమ్ముడు తన స్నేహితుడికి ఫోన్లో వర్ణిస్తున్నాడు. అంతలో ఎవరో నీళ్లు ముఖాన కొట్టడంతో నిద్ర లేచాడు. తమ్ముడికి మత్తు వదిలింది. ఆ రోజుల్లో బాబోరు చూపించిన గ్రాఫిక్స్ ఇంకా మైండ్‌లో నుంచి పోలేదనుకున్నాడు.
అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ట్విన్ టవర్స్ అన్నాడు. మెట్రో అన్నాడు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నామన్నాడు. రోజూ ఏవో కబుర్లు చెబుతూ ప్రతి పండగకు డిజైన్ల పేరుతో గ్రాఫిక్స్ వదిలేవాడు. అందులో ఒకటే అమరావతిలో ఐకానిక్ ట్విన్ టవర్స్. దీని గురించి ఆ రోజుల్లో ఎల్లో మీడియా ఇచ్చిన హైప్‌పై ఎంత చెప్పినా తక్కువే. 2017 ఆగస్ట్‌లో బాబు అమరావతి టవర్స్ డిజైన్లను ఓకే చేశారని మీడియాలో వార్తలొచ్చాయి.
బాబు కలలో వచ్చిందేమో కానీ ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఓ రోజు అమరావతిలో ఆకాశ హర్మ్యాలు కట్టేస్తామని ఏదో నోటికొచ్చింది చెప్పేశారు. తాత్కాలిక ‘వెలగపూడి సెక్రెటేరియట్’ను నిర్మించిన షాపూర్జీ పల్లోంజీ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. వాళ్లు డిజైన్లు చేసి తీసుకొస్తే చూసి సూచనలిచ్చారు. వివిధ దేశాల్లో ఉన్న పది అగ్రశ్రేణి కట్టడాలపై సమగ్రంగా అధ్యయనం జరిపి వాటికంటే గొప్పగా అమరావతి ఐకానిక్ టవర్స్ నిర్మాణం చేపట్టాలని చెప్పారు. ఇంజినీర్లకు తన ఆలోచనలు చెప్పాడు.
టవర్లు ఆంధ్రా పౌరుడి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని బాబు ఆనాడు సూచించారు. ఆయన్ను ఆ సంస్థ ప్రతినిధులు కలిసి డిజైన్లు ఇచ్చారు. కార్యాలయాల కోసం 55–57 శాతం స్థలం, షాపింగ్ ప్రాంతాల కోసం 12–13 శాతం, హోటళ్ల కోసం 12 శాతం, సర్వీస్ అపార్ట్మెంట్ల కోసం 8 శాతం స్థలం కేటాయించగా నారా వారు ఆమోదించారు. ప్రపంచం మొత్తం మనవైపు చూసేలా నిర్మించాలని సూచించారు. పర్యాటకులకు ఇదే గుర్తుకురావాలన్నారు. బిజినెస్ పీపుల్‌కి ఇదే ఉత్తమ స్థలమని అనిపించాలన్నారు. ఇంకేముంది ఎల్లో గ్యాంగ్ అప్పట్లో సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. మా నాయకుడు గొప్ప విజనరీ అంటూ పొగుడుకుంది. ట్విన్ టవర్స్‌లో సినిమా చూస్తా.. బార్‌కు పోతానని తమ్ముళ్లు పోస్టులు పెట్టుకుని సంబరపడిపోయారు.
చంద్రబాబు అల్లిన కట్టు కథల్లో ఎన్నో ఉన్నాయి. రాజధాని పేరుతో చేసిన అరాచకాలు ఒకటి కాదు.. రెండు కాదు.. వేలల్లో ఉన్నాయి. భూ కుంభకోణాలు, రైతుల్ని బెదరించి పొలాలు లాక్కోవడం.. తదితర వ్యవహారాలు బయటకు రాకుండా ఇలా బిల్డింగ్లు, గ్రాఫిక్స్‌తో కవర్ చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం పనులన్నీ తాను చేస్తానని డబ్బా కొట్టుకున్నారు. అందుకే ప్రజలు 19లో 23 సీట్లు ఇచ్చారు. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి మేనిఫెస్టోలో ఈ ట్విన్ టవర్స్‌ను ప్రస్తావిస్తాడో.. లేక జనం ఛీ కొడతారని ఇంకోటి ఏదైనా కట్టేస్తామని చెబుతాడో..