ఆంధ్ర ప్రదేశ్ (ఆంధ్ర ఏరియా) ఇనామ్స్ (ఎబలిషన్ అండ్ కన్వర్షన్ ఇన్ టు రైత్వారీ) చట్టం – 1956 ప్రకారము ఇనాం భూములకు రైత్వారీ పట్టాను రైతులు/ఇనాందారులు/ కౌలుదారులకు మంజూరు చేయుటకు 07.01.1948 ని పరిగణన తేదీగా నిర్ణయించబడినది. ఆంధ్ర ప్రదేశ్ (ఆంధ్ర ఏరియా) ఇనామ్స్ (ఎబలిషన్ అండ్ కన్వర్షన్ ఇన్ టు రైత్వారీ) చట్టం – 1956 లో పొందుపరచబడిన దేవాదాయ భూములు/సర్వీస్ భూములు/సంస్థల సంబంధించిన చట్టం భూములు/ధార్మిక భూములకు దుర్వినియోగమవుతున్నందున సుప్రీం కోర్టు పరిశీలన మరియు ఉత్తర్వుల ఫలితంగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2013 లో ఇనాం భూమి ఎబలిషన్ చట్టానికి సవరణ చేసింది. ఈ సవరణనందు 14.12.1956 నుండి రెట్రాస్పెక్టివ్ గా వర్తించబడేలా ఉత్తర్వులు జారీచేయబడ్డాయి.
కానీ దీనిపై గత టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకూ ఈ విషయంలో ఎలాంటి శ్రద్ధా తీసుకోలేదు. ఈనాడు చెప్పినట్టుగా గత ప్రభుత్వమే పూర్తిగా కుంభనిద్రలో మునిగిపోయింది. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని,2019 ఎన్నికలకు కేవలం 2 నెలలముందు ఆర్డినెన్స్ 2, 2019ను తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ లో కూడా లోపాలుండడంతో చట్టబద్ధతను పొందలేదు. ఈలోగా ఆర్డినెన్స్ గడువుకూడా ముగిసిపోవడంతో దేవాదాయ శాఖ భూములకు, గ్రామ సర్వీసు ఇనాం భూములకు గల వ్యత్యాసాన్ని గుర్తించుటలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
కాగా రీ సర్వే ప్రక్రియలో భాగంగా రైతుల నుండి వచ్చిన అభ్యర్ధనల మేరకు జగన్ ప్రభుత్వం G.O.Ms.No. 310 రెవిన్యూ (ల్యాండ్-1) శాఖ తేదీ.19.07.2023 ను జారీ చేసింది. దీని ప్రకారము ఆంధ్ర ప్రదేశ్ (ఆంధ్ర ఏరియా) ఇనామ్స్ (ఎబలిషన్ అండ్ కన్వర్షన్ ఇన్ టు రైత్వారీ) చట్టం – 1956 ప్రొవిజన్స్ చట్టానికి అమెండ్మెంట్ Act -16 అఫ్ 2013 ఈ క్రింద ఈ భూముల్లో ఉన్న రైతులకు ఊరటనిచ్చేలా చర్యలు తీసుకుంది. దేవాలయ భూములు, ఛారిటబుల్ ఇనాం భూములు, మరియు గ్రామ సర్వీసు ఇనాం భూములను విడదీసి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచే చేసి అనేకమంది రైతులకు, బడుగు బలహీనవర్గాల వారికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకుంది. ఈ భూములకు సంబంధించి గతంలో రైత్వారీ పట్టాలు ఉన్నట్టయితే వారికి హక్కులు కల్పిస్తూ 2023, జులై 19న జీవోనంబర్ 310ని జారీచేసింది.
గ్రామంలో వృత్తులు, కులవృత్తులు చేసుకుంటున్న వారికి, Villages Service_ఇనాములు/ రైత్వారీ పట్టాలు గతములో జారీచేసిన పట్టాలు చెల్లుబాటు అవుతాయి. అటువంటి పట్టాదారులు/చట్టబద్ధ వారసులు/భూములు కొన్నవారిని పట్టాదారులాగా రెవిన్యూ రికార్డునందు అవసరమయిన రీ సర్వే రికార్డుల్లో కూడా పొందుపరుస్తారు. దీనివల్ల వారికి పూర్తి హక్కులు దఖలు పడతాయి. తద్వారా వారు జీవన స్థితిగతుల్లో గణనీయ మార్పులు వస్తాయి. Act-16 అఫ్ 2013 నందలి ప్రొవిజన్స్ మేరకు, G.O.Ms.No.310 అమలుచేయడం ద్వారా సుమారుగా 1,13,610 మంది రైతులకు చెందిన 1,37,250.18 ఎకరాల భూమిని ఆయా రైతులకు లబ్ది చేకూర్చబడింది.
వాస్తవాలు ఇలా ఉంటే అసలు కుంభకర్ణుడు గత ప్రభుత్వమేనన్న విషయాన్ని ఈనాడు దాచేసి ఆ తప్పును ఈప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నంలో భాగంగా వక్రీకరణలతో ఈ కథనాన్ని ప్రచురించింది. అనేకమంది రైతులు, కులవృత్తులు చేసుకునే బడుగు బలహీన వర్గాల వారికి ఇనాం భూముల విషయంలో 2013లో చట్టంచేసినా 2019 ఎన్నికలకు రెండు నెలల ముందువరకూ అసలు ఆ విషయాన్నే పట్టించుకోని గత టీడీపీ ప్రభుత్వం గొప్పగా చేసినట్టుగా, ఇప్పుడు ఈ ప్రభుత్వం వాటిని తొలగిస్తూ ముందుకు సాగుతుంటే నిద్రపోయినట్టుగా ఈనాడు దినపత్రిక ఈ కథనం ద్వారా ప్రజలను పక్కదోవ పట్టించేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది.