రఘురామ కృష్ణంరాజు కి బీజేపీ టీడీపీ జనసేన కూటమి బొమ్మ చూపించింది. నోటికి హద్దూ పద్దూ లేకుండా నాలుగేళ్ళు విర్రవీగిన ఆయనకి సరైన శాస్తి జరిగిందంటూ జనం అనుకునేలా ఆయన పరిస్థితి తయారయింది.
పార్టీ సిద్ధాంతాలను పట్టించుకోకుండా, కేవలం తనకున్న పలుకుబడి, పార్టీ నాయకులతో సంబంధాలు వంటివి తనకు కావలసిన సీటుని చేతికిచ్చేస్తాయిలే అని ఆయన ప్రకటించుకున్న ధీమా తుస్సుమనిపోయింది. నేను ఖచ్చితంగా యన్డీయే కూటమి తరపున నరసాపురం నుంచి పోటీ చేస్తాను అని చెప్పిన ఆయనకి, ఈరోజు ప్రకటించిన సీట్లలో పేరు చేర్చకపోవడంతో తొలి దెబ్బ తగిలినట్లయింది.
అసలు పొత్తు తరఫున మాట్లాడడానికి వెళ్ళినపుడు ఆయన్ని అమిత్షా ఇంటి బయట ఆపినపుడే రఘురామ కళ్ళు తెరిచి ఉండాల్సింది. తనని మించిన అభ్యర్థి నరసాపురం లో ఉండడనీ, ఏ పార్టీ అయినా తనని ఓడించగల నాయకుడిని తెచ్చుకోవడం కల్ల అని రొమ్ము గుద్దుకుని మరీ చెప్పిన రఘురామ కి కూటమి రిక్త హస్తం చూపించింది.
బీజేపీ మొదటి నుంచీ తమకి కావలసిన యంపీ స్థానాల విషయంలో పట్టుదలతో ఉండటం, టీడీపీ కూడా తమ వాటా సీట్లకు ఎసరు పెట్టుకోవడమంటూ సైలెంటుగా ఉండటం, అసలు జనసేనకు ఈ విషయంలో డైలాగులే లేకపోవడంతో రఘురామను వెనకేసుకొచ్చేవారు లేకుండా పోయారు. పాపం ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్ళలేక, ఇక్కడేమో సీటు లేక ఇంక టీవీలలో కుర్చుని విశ్లేషణలు చేస్తూ శేష జీవితం గడిపేస్తాడేమో ఏమో!!