దగ్గుబాటి పురందేశ్వరి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమార్తె. ఈమె ప్రస్తుత ఏపీ బీజేపీ చీఫ్. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు వాణిజ్యం, పరిశ్రమలు, మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2014 సంవత్సరంలో స్వార్థంతో భారతీయ జనతా పార్టీలో చేరారు. కొంతకాలం క్రితం ఏపీ అధ్యక్షురాలైనా అది పేరుకే.. రాజకీయాలు మాత్రం తెలుగుదేశం అధినేత, తన సోదరి భర్త చంద్రబాబు నాయుడు కోసం చేస్తారని విమర్శలున్నాయి. 2019లో బాబు అధికారం కోల్పోయి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి తమ వాడు సీఎంగా లేడని ఈమె వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద వేస్తూనే ఉన్నారు. ఎల్లో మీడియా తాటికాయంత అక్షరాలతో ప్రచురిస్తూనే ఉంది.
తాజాగా పురందేశ్వరి విజయవాడ భాజపా కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్ వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర ఉందంట. వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో లబ్ధిపొందాలని ఆయన పార్టీ చూస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ తమ అభ్యర్థులతోపాటు ఓటర్లను కూడా ఒక చోటు నుంచి మరొక చోటుకు బదిలీ చేస్తోందని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి నిలువరించాలని కోరారు. ముందు వెనుక చూసుకోకుండా చంద్రబాబు ఏ స్క్రిప్ట్ పంపితే అది మాట్లాడేస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఈమెకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా పనిచేస్తుందో తెలియనట్లు ఉంది. వారి ఆధ్వర్యంలో ఎన్నికలు చాలా పటిష్టంగా జరగుతాయి. ఎవరైనా తప్పు చేస్తే ఈసీ కొరడా ఝుళిపిస్తుంది. కఠిన చర్యలు తీసుకుంటారు. దీంతో అధికారులు చాలా జాగ్రత్తగా పనిచేస్తారు. దొంగ ఓట్లకు ఎటువంటి ఆస్కారం ఉండదు. ఎన్నికలకు నెలల ముందే ఈసీ ఓటర్ల జాబితాపై అధికారుల చేత కసతర్తు చేయించి అన్ని వివరాలు పరిశీలిస్తుంది. అభ్యంతరాలు స్వీకరిస్తుంది. అంతా ఓకే అయ్యాకే ఫైనల్ లిస్ట్ వస్తుంది. ప్రతి రాష్ట్రంలో ఇదే జరుగుతుంది. అయితే ఇక్కడ నారా అనే చంద్రముఖి తన స్వార్థం కోసం పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతుంది. ఆ మాటలనే ఆమె వల్లె వేసింది. జగన్ సీఎం అయ్యాక ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అభివృద్ధి చేశారు. అందుకే ఎంతో నమ్మకంతో వైనాట్ 175 నినాదం అందుకున్నారు. ఇటీవల పీఎం నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా కూడా వచ్చే ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యమన్నారు. కమలం పార్టీ దొంగ ఓట్లతో లబ్ధిపొందాలని చూస్తోందా.. పురందేశ్వరి గారే సమాధానం చెప్పాలి. అసలు ఓటర్లను బదిలీ చేయడం ఏంటో.. ఎవరైనా ఊరు లేక, ఇల్లు మారితే ఓటును ట్రాన్స్ఫర్ చేసుకోవడం సర్వసాధారణం. ఈ విషయంపై ఆమెకు అవగాహన ఉండి కూడా సోదరి భర్త కోసం ఈసీ చేస్తున్న పనులు సక్రమంగా లేవనే భావనతో మాట్లాడుతున్నారు.
బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకునేలా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆమెకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కనిపించకపోవడం శోచయనీయం. గతంలో అప్పుల విషయంలో ఎల్లో గ్యాంగ్ లెక్కలు చెప్పి నవ్వులపాలయ్యారు. కేంద్రమే అంత అప్పు లేదని లెక్కలతో సహా వివరించింది. సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేయడంతో పురందేశ్వరి మాటలు తప్పని తేలిపోయింది. ఇక్కడ ఎన్నో పథకాల వినూత్నంగా పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తించకుండా కేంద్ర పథకాలను రాష్ట్రం తమవిగా ప్రచారం చేసుకుంటోందని తెలుగు తమ్ముళ్ల స్థాయికి దిగజారిపోయి మాట్లాడారు. ప్రభుత్వ పనితీరులో లోపాలను ప్రస్తావించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని బీజేపీ చీఫ్ అన్నారు. అలా ఎప్పుడూ ఈ ప్రభుత్వంలో జరగలేదు. టీడీపీ సోషల్ మీడియా జగన్, ఆయన కుటుంబం, మంత్రులపై నీచాది నీచంగా పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతోంది. దీనిపై నోటీసులిచ్చి విచారిస్తే వారికి తప్పుగా కనిపించింది. అసలు అడగాల్సింది అలాంటి పోస్టులు ఎందుకు పెట్టారని కదా.. కానీ తమవాళ్లు ఏమి చేసినా ప్రశ్నించరు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన మంచి కళ్లెదుటే కనిపిస్తున్నా చూడనట్లు నటిస్తూ.. నాడు పదవి ఇవ్వకుండా తమను మోసం చేసిన చంద్రబాబు కోసం పాటుపడుతున్న పురందేశ్వరి ఉండగా ఏపీలో బీజేపీ ఎదుగుతుందనే నమ్మకం కమలం పార్టీ సీనియర్ కార్యకర్తలకు లేదు. చిన్నమ్మా ఫక్తు తెలుగు మహిళలా మాట్లాడితే ఎలా.. మీరు కషాయం జెండా కప్పుకొన్న విషయం మర్చిపోయారా..