చంద్రబాబు కుప్పంలో ఎయిర్ పోర్ట్ కట్టించి కుప్పం కూరగాయలను విమానాల్లో పంపిస్తా అంటూ చెప్పుకొచ్చిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాపంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఏడు సార్లు కుప్పంనుండి గెలిచి కుప్పానికి ఏమీ చేయని ముఖ్యమంత్రిగా నిలిచిన చంద్రబాబుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గాలకి మధ్య అభివృద్ధిలో ఉన్న తేడాలని కొమ్మినేని శ్రీనివాసరావు సుస్పష్టంగా వెల్లడించారు. కొమ్మినేని ఏమన్నారంటే
నేను కుప్పం, పులివెందుల రెండు నియోజకవర్గాలకు వెళ్లి చూసి వచ్చాను. చంద్రబాబు కుప్పంకు 35 ఏళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కుప్పంలో కొన్ని వార్డులకు రోడ్లు కూడా లేవు. మరి 7 సార్లు గెలిచిన చంద్రబాబు కుప్పంలో రోడ్లు ఎందుకు వేయలేదో తెలియదు, బస్టాండ్ కూడా నిర్మించలేదు. కుప్పం సెంటర్ లోనే ఒక ప్రభుత్వ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ అధ్వాన్నంగా ఉంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని నాడు-నేడులో భాగంగా బాగు చేయించారు. కుప్పం రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టినా చంద్రబాబు దానిని పూర్తి చేయలేదు.
బహుశా ఎన్టీఆర్ పాలనలో వచ్చిన ద్రవిడ యూనివర్శిటీ తప్ప చెప్పుకోదగిన ప్రభుత్వ సంస్థ లేదు. ప్రైవేటు రంగంలో మాత్రం ఒక మెడికల్ కాలేజీ ఉంది.14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి కుప్పం ను మున్సిపాల్టీగా,ఆర్డీఓ సెంటర్ కూడా చేయని చంద్రబాబు, ఇప్పుడు వంద కోట్లతో ఎయిర్ పోర్టు కట్టి అక్కడి నుంచి రైతుల కూరగాయల ఉత్పత్తులను ఎగుమతి చేస్తారట.కుప్పంకు తాగు నీటిని ఇవ్వడం కోసం సీఎం జగన్ నిధులు మంజూరుచేసారు. నవరత్నాల కింద కుప్పం నియోజకవర్గంలోనే సుమారు 2వేల కోట్ల రూపాయల మేర ప్రజలకు ఆర్దికసాయం అందింది. కుప్పంను ముఖ్యమంత్రి జగన్ మున్సిపాలిటీగా మార్చడంతో పాటు రెవెన్యూ డివిజన్ చేసారు.
ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం చుట్టూరా బ్రహ్మాండమైన రింగ్ రోడ్డు, ఊళ్లో సైతం మంచి రోడ్డు కనిపించాయి. పులివెందులలో అనేక ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. పరిశ్రమలను తెచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ మధ్యనే ఆదిత్య బిర్లాకు చెందిన పరిశ్రమను జగన్ స్వయంగా సందర్శించి వచ్చారు. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ, త్రిబుల్ ఐటి ,వెటర్నరీ కాలేజీ ఇలా పలు సంస్థలు కనిపిస్తాయి ఇలా ఏ విధంగా చూసిన పులివెందుల అభివృద్ధి కుప్పంతో పోలిస్తే మరో స్థాయిలో ఉంది. ముఖ్యమంత్రిగా ఉండి సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని చంద్రబాబు ఇప్పుడు మాత్రం కుప్పంపై కపట ప్రేమ ఒలకబోయడం చూసి రాష్ట్ర ప్రజలంతా నవ్వుకుంటున్నారు.