గత ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే నేడు పచ్చగూటికి చేరాడు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పచ్చ జోస్యం చెబుతున్నాడు. నిజానికి తాను 2019 ఎన్నికల అనంతరం రాజకీయ వ్యూహరచన నుండి తప్పుకున్నాను అని స్వయంగా ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ చిల్లర పైసల కోసమే బాబుకు అనుకూల పలుకులు పలుకుతున్నాడు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆయా పార్టీల మధ్య వాతావరణం చాలా వాడి వేడిగా ఉంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయలేక పవన్ కళ్యాణ్ బూచిగా చూపి ఎట్టకేలకు బిజెపితో పొత్తు కుదుర్చుకున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీలలో టిడిపి జనసేన బిజెపి కూటమి ఒకపక్క అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక పక్క పోటీకి తలబడనున్నాయి..ఈ ఎన్నికల నేపథ్యంలో కాస్తో కూస్తో టిడిపికి ప్రజలలో అనుకూల వాతావరణం ఉంది అని జనాల్ని భ్రమింప చేయడం కోసం బాబుకు అవసరమైనప్పుడల్లా అనుకూల ప్రకటనలు చేయడం కోసం ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపట్టబోయేది ప్రస్తుత అధికారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని ఇప్పటికే పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
అయితే ఏమాత్రం గెలుపుకి అవకాశం లేని టిడిపి పార్టీని ఏ యంత్రాంగము లేని ప్రశాంతి కిషోర్ కేవలం చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసమే జాకీలు పెట్టి లేపుతున్నాడు. గతంలోనూ ఇలాగే చంద్రబాబు లగడపాటితో చిలక జోస్యాలు చెప్పించేవాడు. అయితే ఆ చిలక జోస్యలు వికటించడంతో లగడపాటి అడ్రస్ లేకుండా పోయాడు. అలాగే ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ కూడా మాయమైపోవడం ఖాయం అంటున్నారు రాజకీయ విమర్శకులు. అయితే 2019 ఎన్నికల తర్వాత తానే స్వయంగా పార్టీ పెట్టిన ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా తన భవితవ్యం దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. దానితో ఇం’ధనం’ ఎవరికి నచ్చినట్లు వారికి చిలక జోస్యం చెబుతున్నాడు. కానీ, తెలంగాణ, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ప్రశాంత్ కిషోర్ చిలక జోస్యం ప్రకటించడం గమనార్హం.