చంద్రబాబు హామీలు నీటి మీద రాతలని ప్రకాశం జిల్లా వాసులకి తెలియడానికి ఎంతోకాలం పట్టలేదు. తనకి అవకాశం ఇస్తే ప్రకాశం జిల్లా రూపురేఖలు మారుస్తానని కల్లబొల్లి మాటలు చెప్పిన బాబు మాటలు నమ్మి, పాలనలో అనుభవం ఉందన్న ఒకే ఒక్క కారణంతో తనకు ఓట్లేసిన ప్రకాశం జిల్లా ప్రజలకు చంద్రబాబుకి మొండిచెయ్యి చూపాడు. ప్రకాశం జిల్లా వాసులకి చంద్రబాబు ఇచ్చిన హామీలను పరిశీలిస్తే..
– దొనకొండ పారిశ్రామిక నగరం
– యూనివర్సిటీ ఆఫ్ మైన్స్ మరియు మినరల్స్ సైన్సెస్
– ఒంగోలులో ఎయిర్పోర్టు
– కనిగిరిలో జాతీయ పెట్టుబడులు మరియు ఉత్పత్తి జోన్
– రామాయపట్నం పోర్టు
– ఫుడ్ పార్క్
– ఏడాదికాలంలో వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేయడం
– స్మార్ట్ సిటీ
– ఆక్వాకల్చర్ మరియు ప్రాసెసింగ్ యూనిట్
2014 లో రాష్ట్ర విభజన అనంతరం 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేలా కేంద్రం చట్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటులో భాగంగా ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉన్న దొనకొండ ప్రాంతం అనువుగా ఉంటుందనే ఊహాగానాలు నడిచాయి. కానీ స్వప్రయోజనాల కోసం తమ భూముల విలువలను పెంచుకోవడానికి చంద్రబాబు అమరావతికి మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలో దొనకొండలో పారిశ్రామిక నగరం నిర్మించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని వలసలకు అడ్డుకట్ట వేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. కానీ ఆ హామీ కనీసం శంకుస్థాపనకు కూడా నోచుకోకపోవడం గమనార్హం. యూనివర్సిటీ ఆఫ్ మైన్స్ & మినరల్స్ సైన్సెస్ తీసుకొని వస్తానని చెప్పిన చంద్రబాబు ఆ వైపు కూడా అడుగులు వేయలేదు. ఒంగోలులో ఎయిర్పోర్టు హామీ, హామీగానే మిగిలిపోయింది. కనిగిరిలో జాతీయ పెట్టుబడులు మరియు ఉత్పత్తి జోన్ ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చిన చంద్రబాబు ఆ ప్రస్తావన గెలిచిన తరువాత ఒక్కసారీ తీసుకురాలేదు.
రామాయపట్నం పోర్టుకి అధోగతి పట్టించాడు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రామాయపట్నం పోర్టు పనులను పరుగులు పెట్టించడంతో 18 నెలలోనే మొదటి దశ పనులు పూర్తి చేసుకొని కార్యకలాపాలు నిర్వహించడానికి సిద్దంగా ఉంది. ఏడాది కాలంలో వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తి చేస్తానని గర్వంగా ప్రకటించిన చంద్రబాబు, 2014 లో అధికారంలో ఉన్నంతకాలం వెలిగొండ ప్రాజెక్టును ఏటీఎం మెషిన్ లాగా వాడుకున్నాడు. ఆఖరికి అధికారం చేపట్టిన జగన్ ఈ ప్రాజెక్ట్ మొదటి దశ 2021 జనవరిలో, రెండో దశ పనులు 2024 జనవరిలో పూర్తిచేయడం గమనార్హం. ఫుడ్ పార్క్ ఊసే లేదే. స్మార్ట్ సిటీ, ఆక్వాకల్చర్ మరియు ప్రాసెసింగ్ యూనిట్ హామీలను ఇచ్చానన్న సంగతి కూడా చంద్రబాబుకు గుర్తులేదు. అధికారం కోసం నోటికి వచ్చిన హామీలను గుప్పించడం తరువాత వాటి ప్రస్తావన తీసుకురాకపోవడం చంద్రబాబుకు పరిపాటిగా మారిపోయింది.