మనం అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాకర్షక పాలన ఉన్నప్పుడు అవి మన మాటల్లో చేతుల్లో అలవోకగా దొర్లుతాయని జగన్మోహన్ రెడ్డి నిరూపిస్తున్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ అలవోకగా అన్న “ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు” అనే మాట అటువంటి కోవలోనిదే.
ఎన్నికలంటే నిలువెత్తు జూదం, ఎవరి దశ ఎటు తిరుగుతుందో తెలియని పరిస్థితి. అప్పటి వరకూ మామూలుగా ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఓటరుగా మారి తమ శక్తిని చూపించగలిగే ఒక రోజు. మరి అంతటి కఠినతరమైన కార్యాన్ని ఇంత సులువుగా జగన్ తీసుకుని, ప్రజల మీదే తన బాధ్యత ఎలా పెట్టగలిగారు??.
కనిపించడానికి అతి సులువుగా ఉన్న ఈ మాటను తరిచి చూస్తే జగన్ యొక్క కాన్ఫిడెన్స్ తెలుస్తుంది. తన పాలన మీద తనకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. నాడు – నేడు, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన అంటూ ఓట్లులేని చిన్న పిల్లల కోసం ఇంతకు ముందు ఏ ప్రభుత్వం పట్టించుకుంది? జగన్ పట్టించుకున్నాడు. తద్వారా ఆ పిల్లల తల్లిదండ్రుల మనసులు గెలుచుకున్నాడు.
హాస్టళ్ళలో సరైన తిండే ఉండదు అనుకునే పరిస్థితి నుండి ఏ రోజు ఏమి పెడతారో ఎంత పెడతారో ముందుగానే చెప్పే స్థితి కి తీసుకొచ్చి, ఎదిగే వయసులో వారికి పౌష్టికాహారం ఎంత ముఖ్యమో గమనించి అక్కడా ఆ పిల్లలకి తానే తల్లీ తండ్రి అయ్యాడు.
వెల్ఫేర్ సంస్థల ద్వారా స్త్రీలకు ఆర్థిక భరోసా ఇస్తూ లోన్లు ఇవ్వడం, వారి కాళ్ళపై వారు నిలబడేలా చేయడం, రైతు భరోసా మొదలగు పధకాల ద్వారా రైతులు ఆదరణ చూరగొనడం ఇలా ఏది చేసినా, ఏ సంక్షేమం చేసినా ప్రజల మంచే ధ్యేయంగా చేసాడు కాబట్టే, అంత నమ్మకంతో, అంత ఆత్మవిశ్వాసంతో ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు అంటూ అనగలిగాడు. ప్రజలే తనని ముందుకు తీసుకెళతారని అతడికి తెలుసు.