పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి జనసేన కార్యకర్తలకు, నేతలకే నచ్చడం లేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు పాదాల దగ్గర బ్రతకాల్సి వస్తుంది అని నిలదీస్తున్నారు. పొత్తులో భాగంగా మన సీట్లు మనవాళ్ళకి ఎందుకు కేటాయించుకోలేని దుస్థితిలో పవన్ కళ్యాణ్ నాయకత్వం ఉంది అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా రాజకీయ పార్టీలు పెట్టేది ప్రజలకు సేవ చేయటానికి.. చిత్తశుద్ధితో నలుగురికి మంచి చేయడం కోసమే కానీ పవన్ కళ్యాణ్ లా కేవలం తన స్వార్ధ రాజకీయాల కోసం బానిసత్వం చేయడానికి కాదు అని మొహం మీదే కడిగేస్తున్నారు.
నిన్నటి వరకు జనసేన జెండా మోసిన నాయకులు ఈరోజు చంద్రబాబు నీచ రాజకీయ క్రీడలో పావులుగా మారి జనసేన ఖాతాలో బలైపోతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మోసానికి బలైపోయిన జాబితాలో చేరాడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పోతిన మహేష్… గత కొన్నేళ్లుగా ఎంతో నమ్మకంగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లడానికి కష్టపడుతున్నాడు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన నుండి పోటీ చేయటానికి పార్టీ కోసం తన శక్తికి మించి పని చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు పోతున మహేష్ కి ఇస్తానని గతంలోనే హాయం ఇచ్చినటువంటి పరిస్థితి.
వేల కోట్ల రూపాయలు ఉన్న సృజనా చౌదరి కోసం ఇంత కాలం నమ్మకంగా పార్టీ కోసం పని చేసిన బీసీ సామాజిక వర్గానికి చెందిన పోతిన మహేష్ కి సీట్ ఇవ్వకుండా అన్యాయం చేశాడు పవన్ కళ్యాణ్. ఇలా పవన్ కళ్యాణ్ మోసానికి బలైపోయింది ఒక్క మహేష్ ఒక్కడే కాదు ఇప్పటికే జనసేన పార్టీలో సీట్లు ఆశించి తమ సర్వం పోగొట్టుకుని రోడ్ల మీద నిలబడ్డ చాలామంది జనసేన నాయకుల్ని ఆదుకోకపోగా తన చేతులతో పవన్ కళ్యాణ్ స్వయంగా మోసం చేశాడు.
దీంతో పవన్ కళ్యాణ్ నీచ రాజకీయంలో మిగిలిపోయిన పోతున్న మహేష్ లాంటి వాళ్ళు స్వయంగా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ ని, అతని పార్టీని గాని నమ్మొద్దు అని పిలుపునిస్తున్నారు. ఇంతకాలం నమ్మి నిజాయితీగా పార్టీ కోసం పని చేసిన మాకే ఇంత మోసం అన్యాయం జరిగితే చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే పవన్ కళ్యాణ్ రేపొద్దున గెలిచిన సరే ప్రజలకు ఎలాంటి మంచి చేయలేడు అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు , అందుకే పవన్ కళ్యాణ్ 2019 లో రెండు చోట్ల పోటీ చేసిన సరే ప్రజలు తమకు కావలసిన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ని రెండు చోట్ల ఓడించారు. జనసేన జండా మోసిన మేమే అమాయకులు తప్ప పవన్ కళ్యాణ్ విషయంలో ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు అని, దయచేసి ఎవ్వరూ జనసేన పార్టీకి ఓటు వేయొద్దు అది మరో ప్రజారాజ్యం గా మారబోతుంది అని జనసేన కార్యకర్తలను నాయకులను వీర మహిళలను హెచ్చరించారు.