జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీని బలోపేతం చేయటం కోసమే జనసేన పనిచేస్తున్నట్లు ఆరోపించారు. చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారు కాబట్టి కూటమిలో భాగమయ్యాడు అని అన్నారు. జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయినా వెంటనే పొత్తు ప్రకటనకు కారణం తెలపాలి అని అడిగారు. జైల్లో చంద్రబాబుని కలిసిన తరువాత పవన్ కొన్న ఆస్తుల వివరాలు బయట పెడతానని చెప్పారు.
ఎలక్టోరల్ బాండ్స్‌లో పవన్ కల్యాణ్‌కి ఎంత ముట్టిందో చెప్పాలంటూ వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు తానే బయటపెడతానని చెప్పుకొచ్చారు. కౌలు రైతుల పేరుతో ఎన్నారైల నుంచి వసూలు చేసిన చందాలెంతో చెప్పాలని డిమాండ్ చేసారు. 3000 మంది కౌలు రైతులకు సహాయం అందిస్తానని చెప్పి ఇప్పటివరకు ఆరు జిల్లాలో చెందిన కవులు రైతులకు మాత్రమే సహాయం అందించాడు మిగిలిన డబ్బుని ఏం చేశాడో వివరాలు తెలియజేయాలని కోరారు.
జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ ఆర్థికంగా బాగా ఎదిగాడని ఈ సందర్భంగా తెలిపాడు. పవన్ కళ్యాణ్ తో అపాయింట్మెంట్ల పేరుతో కోట్ల రూపాయలని సొమ్ము చేసుకున్నాడు, దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నట్లు పోతిన మహేష్ మీడియా ముఖ్యంగా తెలిపారు. నాదెండ్ల మనోహర్‌కి స్పోర్ట్స్ కారు కొనేందుకు పది కోట్లు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏ ఎజండాతో పవన్ పార్టీ పెట్టారని నిలదీసారు. శిఖరం ఎవరికి తెలవంచదు, ఎవరు పల్లకిలు మోయడానికి రాజకీయాల్లోకి రాలేదు అని మాలాంటి వారిని మోసం చేసి చంద్రబాబు పల్లకీ మోయటమే పవన్ లక్ష్యమా అంటూ మండిపడ్డారు. పవన్ ది బ్రాండ్ కాదని..మోసమని విమర్శించారు.
హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభంపై ఇప్పటికి నాలుగేళ్లకు పైగా కావస్తోందని కానీ ఆ సినిమా ఇప్పటివరకు పూర్తి కాకపోవడానికి గల కారణమేంటని అడిగారు. హరిహర వీరమల్ల సినిమా ద్వారా బ్లాక్ మనీని వైట్ చేసుకొనే రూటింగ్ గా చేసుకుంటున్నాడని ఆరోపించారు. పవన్‌పై దిల్ రాజు ఐటీకి ఫిర్యాదు చేసింది నిజం కాదా అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.
అయినా జనసేన అభ్యర్థులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించడం ఏంటి, జనసేన అభ్యర్థులతో జనసేన నాయకుడు కదా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించాల్సింది.నా పది సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇలా వేరే పార్టీ నాయకుడు ఇతర పార్టీ అభ్యర్థులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం బహుశా మొదటిసారి కావొచ్చేమోనని అన్నారు. జనసేనను టీడీపీలో విలీనం చేసేసారా అని నిలదీసారు. రాజకీయాలని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించటంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ దిట్టని పేర్కొన్నారు. తన ప్రశ్నలకు సమాధానం ఇస్తానంటే ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమని పోతిన మహేష్ సవాల్ చేసారు.