బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి ఎన్నికయిన దగ్గరనుంచీ తన మార్కుని పార్టీ మీద, పార్టీ కార్యకర్యల మీద చూపించలేదు కానీ, ఎన్నికలు దగ్గరకొచ్చే కొద్దీ తన మార్కు రాజకీయాన్ని చూపించడానికి మాత్రం ఉవ్విళ్లూరుతున్నారు. పైకి కత్తులు నూరినట్టుగా కనపడే నారా – దగ్గుబాటి వారు తమ కుటుంబం జోలికి, అధికారం జోలికి వస్తే మాత్రం అంతా ఏకతాటిపైకి వచ్చేస్తారు.
టీడీపీ జనసేన పొత్తు కుదిరిననాటి నుండీ పవన్కళ్యాణ్ ఆంధ్రా విషయంలో తమ స్టాండ్ ఏమిటని బీజేపీని అడుగుతూనే ఉన్నారు. మొదట్లో టీడీపీ కూటమిలో చేరడానికి ఇష్టపడడానికి బీజేపీ, ఆశావహ అభ్యర్థుల జాబితాను తయారు చేయమని పురంధరేశ్వరి కి చెప్పారు కూడా. కానీ చిన్నమ్మ ప్లాన్లు వేరుగా ఉన్నాయి. ఆవిడ పార్టీ పగ్గాలు అందుకున్న దగ్గరనుంచీ టీడీపీతో పొత్తు వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు.
అయోధ్య ఆరంభం తరువాత మళ్ళీ రాజకీయాలపై దృష్టి పెట్టిన బీజేపీ, పొత్తు కి సుముఖతను చూపిస్తూ కింది స్థాయి కి సూచనలు పంపించింది. అయితే తాము కోరుకున్న సీట్లు ఇస్తేనే టీడీపీ జనసేన పొత్తులో చేరతామని స్పష్టం చేసింది.దానితో చిన్నమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజమండ్రి లోక్ సభ, రాజమండ్రి నగరం, పి.గన్నవరం మొదలగు ఎంపీ సీట్లను బీజేపీ ఆశిస్తుంది. పొత్తులో భాగంగా అవి ఇస్తే అక్కడి నుండి పోటీకి చిన్నమ్మని దింపాలని యోచనలో కూడా ఉంది.
చిన్నమ్మకేమిటీ లాభం ? పురంధరేశ్వరి ఎంత తలుచుకుని, పూనుకున్నా బీజేపీ తరఫున ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే కూడా ఆంధ్రాలో గెలవలేరు. అలా అని ఊపులేని పార్టీ కి ఎంత ఊడిగం చేసినా ఉపయోగం లేదు. అదే పొత్తులో అయితే టీడీపీ జనసేన బలంతో ఏ ఎంపీగానో నెగ్గితే, ఆ పేరు చెప్పుకుని కేంద్రం లో ఏ మంత్రి పదవో దక్కించుకోవచ్చు. కొన్ని రోజులు చక్రం తిప్పొచ్చు. అందుకని కాలు కాలిన పిల్లిలా టీడీపీ చుట్టూ తిరుగుతూ బీజేపీ పార్టీ మొత్తాన్ని రెండు ఎంపీ ఎమ్మెల్యే టికెట్లకోసం తాకట్టు పెట్టడానికి సిధ్ధమయిపోయింది.