ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అని రాష్ట్ర బీజేపీఅధిష్టానం తెలిపింది . ఈ నెల 7, 8 తేదీల్లో ఆంధప్రదేశ్‌లో పర్యటనలో భాగంగా పలు జిల్లాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలు, రోడ్‌షోల్లో మోడీ పాల్గొంటారు అని పార్టీ కార్యాలయం తెలిపింది . ఈ నెల 7న సాయంత్రం 3.30 గంటలకు తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం లోక్‌సభ ఎన్డీయే అభ్యర్థి పురందేశ్వరికి మద్దతుగా ప్రచారంలో పాల్గొని వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారు. అదే రోజు సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలో లోక్‌సభ ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేష్ కి మద్దతుగా రాజుపాలెం సభకు హాజరవుతారు.
మరుసటి రోజు 8న సాయంత్రం 4 గంటలకు లోక్‌సభ ఎన్డీయే అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి కి మద్దతుగా అన్నమయ్య జిల్లా పీలేరు సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 7 గంటలకు విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు ప్రధాని రోడ్‌షో లో పాల్గొంటారని తెలిపింది . వాస్తవానికి ఈ నెల 3,4 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారానికి రావాలని భావించారు. బిజీ షెడ్యూల్ కారణంగా మార్పులు, చేర్పులు జరిగాయని చెబుతున్నారు. మే 8,9 తేదీలలో మోడీ తెలంగాణలో పలు సభలో పాల్గొంటారు అని తెలంగాణ బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. అదే తేదీలలో మోడీ పర్యటన ఆంధ్ర బీజేపీ ప్రకటించింది .. ఎన్నికలు పూర్తి అయ్యేలోపు మోడీ ఆంధ్రాలో పర్యటిస్తారో లేదో చూడాలి .