జనసేన పార్టీ తరుపున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటి చేస్తున్న విషయం విధితమే. కూటమిలోని టీడీపీనుండి వర్మ పోటి చేద్దాం అనుకున్న వేళ ఆ టికెట్ ను జనసేన తరుపున పవన్ కళ్యాణ్ కు కేటాయించారు . దీనితో ఒక్కసారిగా నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాయుడ్ని చీల్చి చెండాడరు. ఆతరువాత జరిగిన సర్ధుబాటులో వర్మ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్న అని ప్రకటించడంతో ఆ గొడవలు పైకి మాత్రం సద్దుమనిగాయి. ఇక పవన్ కళ్యాణ్ నా విజయం వర్మ చేతుల్లో పెడుతున్న అంటూ టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ప్రకటించి టీడీపీ కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. వర్మ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కొరకు తన వంతు నియోజకవర్గం పరిధిలో ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు.
అయిన వర్మ మీద నమ్మకం లేక జనసేన పార్టీ నియోజకవర్గ భాద్యతలను నాగబాబుకు అప్పగించడమే కాకుండా పార్టీలో టికెట్ దక్కని కీలక నాయకుల ఆధ్వర్యంలో 240 మంది జనసేన క్రియాశీలక నాయకులు కార్యకర్తలతో కమిటీలు వేశారు. అలాగే డజను మంది జబర్దస్త్ టీంతో స్థార్ కాంపెయినర్లు అని వారితో నియోజకవర్గంలో ప్రచారం చేపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, వర్మ ఎక్కడ వెన్నుపోటు పొడుస్తారో అనే ఓటమి భయంతో చివరకు చిరంజీవినీ ప్రచారానికి రప్పించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే మెగా కుటుంబానికి చెందిన నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్ తో పిఠాపురంలో ప్రచారం మొదలుపెట్టారు.
ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు తమకు జరుగుతున్న అవమానంగా టీడీపీ కార్యకర్తలు వారి నాయకుడు వర్మ భావిస్తున్నారు, ఎలక్షన్ మొత్తం వర్మ చేతుల మీదుగా టీడీపీ నాయకులను ముందుంచి జరుగుతాయి అని ప్రకటించి ఇప్పుడు కేవలం జన సేన నాయకులే చూసుకుంటూ ప్రచారంలో గౌరవం ఇవ్వకుండా వుండటం, మొత్తం సినిమా వాళ్ళతోనే ప్రచారం నిర్వహించడం జబర్థస్త్ నటులకు ఇచ్చిన విలువ వర్మకు ఇవ్వకపోవడంతో లోపల లోపల టీడీపీ నాయకులు రగిలిపోతున్నారు. పవన్ కళ్యాణ్, జన సేన పార్టీ తమ ఒంటెడ్డు పోకడలను ఇలానే కొనసాగిస్తే కూటమి పొత్తు వికటించడం ఖాయంగా కనిపిస్తోంది అంటూ నియోజకవర్గ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు .