మీడియా ప్రతినిధిపైనే కాదు దేశ పౌరుడు ఎవరిపైనైనా వ్యక్తులు దాడులు చెయ్యటం చట్టప్రకారం నేరం, ఖండనార్హం. దాన్నలా ఉంచి ఈ దుస్సంఘటనకు అసలు కారణాలు ఏమిటీ ? అక్కడ ఒక రాజకీయ పార్టీ సభను లక్షల మందితో నిర్వహించుకుంటుంటే ABN ఆంధ్రజ్యోతి అనే దమ్మున్న ఒక పత్రిక తమదైన పైత్యపు జర్నలిజములో భాగంగా ఎప్పటిలానే తమ శత్రువు ( ప్రత్యర్థి కాదు ) పార్టీ సభ వైఫల్యం చెందిందని జనం లేక ఖాళీ కుర్చీలతో సభ వెలవెలపోయిందని ఇలా తన సొంత వికారాలను జోడించి రాయటం అలవాటుగా చేసుకుంది. అలాంటి సభలకు వెళ్లిన, చూసిన వారికి సహజంగానే అలాంటి జర్నలిజంపై రోత పుడుతుంది. అయినా దమ్మున్న జర్నలిజమంటే అదేనని ఒక మతిమాలిన విధానాన్ని పెట్టుకుంది.
ఈ నేపథ్యములో సదరు మీడియా ప్రతినిధి అక్కడకు వెళ్లటం, వీళ్ళ దమ్మున్న జర్నలిజం పైత్యం తెలిసిన అక్కడి ఆ పార్టీ కింద స్థాయి యువ కార్యకర్తలు ఆగ్రహం చెంది చేయి చేసుకోటం జరిగింది. అక్కడ ఆ మీడియా ప్రతినిధి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాడని వార్తలు వచ్చాయి.
ఇక్కడ గమనించాల్సింది అక్కడి సభకు పదుల సంఖ్యలో మీడియా ప్రతినిధులు వెళ్లగా ఆ దమ్మున్న మీడియా ప్రతినిధిపై మాత్రమే ఎందుకు దాడి జరిగిందని ఆ దమ్మున్న పత్రిక కాస్త మనసు కూడా పెట్టి ఆలోచించుకోవాల్సిన అవసరాన్ని ఈ సంఘటన తెలియజేస్తోంది.
తన మనసులోని భావాలను, దాని వెనకున్న స్వార్ధపు కారణాలను దాస్తూ ఒక రాజకీయ పార్టీకి ఏకపక్షంగా బట్టలిప్పుకొని ఫోర్త్ ఎస్టేట్ లో భాగమని చెప్పుకొనే ఒక మీడియా సంస్థ మద్దతివ్వటం రాష్ట్ర ప్రజలకు రోత పుట్టిస్తోంది. మరా రాజకీయ పార్టీ అంత సుగుణమైనదైతే తాము, తమ లాంటి మరికొన్ని మీడియా సంస్థలు బరితెగించి జర్నలిజపు విలువలను పాతిపెట్టి మరీ మద్దతిచ్చిన పార్టీని పోయిన ఎన్నికల్లో ప్రజలు ఎందుకు అతి ఘోరంగా తిరస్కరించారో కూడా దమ్ముతో కాకుండా మనసు పెట్టి ఆలోచించుకోవాలి.
ఆ ఘోర ఓటమి తరువాతైనా మనం ఎన్ని కపట రాతలు రాసిన , చెప్పినా ప్రజలను మభ్యపెట్టడం అంత సులభం కాదని గ్రహించకుండా, ప్రజలు గత ప్రభుత్వముపై దాని వ్యవహారం , పరిపాలన కారణంగా ఆ స్థాయిలో వ్యతిరేకతతో ఉంటే తాము మాత్రం మభ్యపెట్టే కపట రాతలతో తార్పుడు గాళ్ళ మల్లె ఆ ప్రజలను తమ పార్టీకి చేరువగా చెయ్యటానికి ప్రయత్నించటం ఒక సిగ్గుమాలిన జర్నలిజం కిందకే వస్తుందని గ్రహించాలంటే ఉండాల్సింది దమ్ము కాదు విజ్ఞత.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించే కొన్ని అతి ముఖ్యమైన రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కూడా తమ మీడియా కవరేజీ లేకపోతే, తాము కూయకపోతే తెల్లారదనే విధంగా ప్రభుత్వం చతికల పడుతుందని భావించే మనోవైకల్యపు మీడియాగా మారిపోవటం వారి దౌర్భాగ్యాన్ని తెలియజేస్తుంది. రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడే అతి ముఖ్యమైన పెట్టుబడి దారుల సమ్మేళనం పై కూడా అపహాస్యపు రాతలతో విషాన్ని చిమ్మటమంటే రాష్ట్ర ప్రజల బాగు తమకు ముఖ్యం కాదని తమ వారి రాజకీయ పార్టీ ద్వారా తమ ప్రయోజనాలే ముఖ్యమని భావించటానికి ఉండాల్సింది దమ్ము కాదు మూర్ఖత్వం.
ఇంతటి వికారపు జర్నలిజముతో కూడిన ఒక మీడియా సంస్థ తమ ప్రతినిధులను తమకు గిట్టని రాజకీయ పార్టీ ఎన్నికల సన్నాహక సభకు పంపటం, వారి ద్వారా కపటపు వ్యతిరేక వార్తలను వండి వార్చాలని చూడటం ఆ ప్రతినిధులను సమస్యల్లోకి నెట్టడమే. తమకున్నదని చెప్పుకొనే ఆ పనికిమాలిన దమ్మును పక్కన పెట్టి రాష్ట్ర, రాష్ట్ర ప్రజల శ్రేయస్సే కొలమానంగా జర్నలిజాన్ని మార్చుకుంటే ప్రజలు, రాజకీయ పార్టీలు గౌరవిస్తారు, కాదు తాము ఎక్కడికైనా వెళతాం తమ తార్పుడు జర్నలిజం కొనసాగిస్తాం, తమ దమ్మెంతో చూపిస్తామని విర్రవీగుతూ పోతే జనం కూడా “తగురీతిలో” గౌరవిస్తుంటారని ఇలాంటి సంఘటనలు తెలియజేస్తుంటాయి.