2019 లో రెండు చోట్లా ఓడిపోయిన తర్వాత గెలిచిన సీఎం జగన్ మీదే కాక తన పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వరప్రసాద్ మీద కూడా అసూయ పెంచుకున్న పవన్ తన ఓటమికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఏనాడూ కనీస ప్రయత్నం చేయలేదు. అలాగే తను ఎక్కడ పోటీ చేస్తే బావుంటుందో అనే ఆలోచన చేయడానికి కూడా ఐదేళ్లు సరిపోలేదు. తీరా ఎన్నికలు దగ్గర పడ్డాకా ఎన్నో తర్జన భర్జనల తర్వాత కాపు ఓట్లు ఎక్కువ గా ఉన్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు కుల వ్యవస్థ వ్యతిరేకిని అని చెప్పుకునే పవన్ కల్యాణ్…
గత ఎన్నికల అవమానాన్ని తప్పించుకోవడానికి ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలి అని గట్టిగా కోరుకుంటున్నాడు. దానికోసం పడరాని పాట్లన్నీ పడుతున్నాడు. ముందుగా వర్మ తిరుగుబాటు ను తట్టుకోడానికి బాబు చెంతకు పంచాయితీ చేర్చగా వర్మ తాత్కాలికంగా శాంతించాడు. 2019 ఎన్నికల సమయం లో పేకాట ఆడుకునే వర్మ అంటూ విమర్శ చేసిన పవన్ ఇప్పుడు వర్మ వీరుడు శూరుడు అంటూ పొగుడుతూ తనని గెలిపించే భాద్యత వర్మదే నని చేతులు పట్టుకు బతిమాలాడు..
ఇక రాత్రులు నాలుగు ఊర్లు తిరుగుతూ పగలు ఎండకి తాళలేక జ్వరం అంటూ హైదరాబాద్ వెళ్లిపోతున్నాడు అని విమర్శ రాగానే పగలు కూడా తిరగడం మొదలు పెట్టాడు.. పిచ్చి వాడు సైతం చేయని పనులు కొన్ని.. అందులో మొదటిది కాళ్ళకు చెప్పులు ఉంటె వాటిని చేత పట్టుకుని నడి ఎండలో తిరగడం. పవన్ అది చేసేశాడు. దాని వల్ల ఏ సందేశం ఇవ్వాలని ఆయన ఉద్దేశమో ఆయనకి కూడా బహుశా తెలిసి ఉండకపోవచ్చు…
ఇక కాపు ఓట్లు అధికంగా ఉన్నాయని పిఠాపురం నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్న పవన్ కు అటు వైపు వైసీపీ అభ్యర్థి గీత గారికి ఉన్న బలం ముందుగా అంచనా వేయలేక ఇప్పుడు తల పట్టుకున్నాడు. దానిలో భాగంగా క్రిస్టియన్ ఓట్ల కోసం తన తండ్రి వ్యక్తిత్వాన్నే పణంగా పెట్టాడు.. గతంలో తన తండ్రి నాస్తికుడని, ఇంట్లో తన నానమ్మ దేవుడు ముందు దీపం వెలిగిస్తే ఆ దీపంతో సిగరెట్ వెలిగించుకునేవాడని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు తన చిన్నతనం లో తన తండ్రి బైబిల్ చదివేవాడని, ఇంట్లో ఎప్పుడు బైబిల్ ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆయన నాస్తికుడా? లేక క్రిస్టియనా? అనేది ఎవరికి అంతుచిక్కని విషయం. అది పక్కన ఉంచితే ఈ వ్యక్తీ తన ఇంట్లో అదీ కాక తన తల్లి గారి ముందు సిగరెట్ తాగడు.. కానీ తన తండ్రి అలా సిగరెట్ వెలిగించుకునే వాడని తన తండ్రి వ్యక్తిత్వాన్నే హననం చేశాడు.. ఇన్ని చేసినా అన్ని సర్వే లలో పవన్ మరో సారి ఓటమి చవిచూడబోతున్నాడు అని తేలడంతో, అసెంబ్లీ లోకి అడుగు పెట్టాలన్న తన కోరిక కోరికలానే మిగలనుందని విశ్లేషకుల అంచనా… పాపం పవన్ అసెంబ్లీ లోకి అడుగు పెట్టాలనే కోరికను అసెంబ్లీ విజిటింగ్ పాస్ తీసుకుని అయినా నెరవేర్చుకుంటే బావుండు..