పవన్ ఓటడుగుతుంది కాపులకి న్యాయం చేసిన వారికా.. ద్రోహం చేసిన వారికా?
చంద్రబాబు అధికారంలోకి రాకముందు, తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాపు సామాజిక వర్గానికి ఏడాదికి వెయ్యికోట్ల చొప్పున ఐదేళ్లలో 5 వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు.. ఎన్నికల్లో విజయం సాధించాక ఇచ్చిన 600 హామీల్లాగే ఈ హామీ కూడా అటకెక్కింది. ఐదేళ్లలో మొత్తం గా 1340 కోట్లు మాత్రమే ఖర్చు చేసారు. పైపెచ్చు కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆ సామాజికవర్గం వారు చేసిన నిరసనలను తీవ్రం గా అణచివేసారు, ముద్రగడ లాంటి వారిని తీవ్రంగా హింసించారు కూడా.
తీరా ఎన్నికలు దగ్గర పడటంతో కేంద్రం ఆర్థికంగా బలహీనంగా ఉన్న అగ్రవర్ణ పేదలకు (EWS) కేటాయించిన 10% రిజర్వేషన్లలో 5% కాపులకు ఇస్తామని మరో అలివికాని హామీ ఇచ్చారు. రిజర్వేషన్లు అనేది కేంద్ర పరిధిలో ఉండే అంశం. ఏ వర్గానికైనా కొత్తగా రిజర్వేషన్లు కల్పించాలి అంటే రాజ్యాంగ సవరణ, అదికూడా ప్రత్యేక మెజారిటీతో మాత్రమే సాధ్యమయ్యే అంశం. రాష్ట్ర ప్రభుత్వాల అధికారం ఇందులో శూన్యం, కోర్టులలో నిలబడని సందర్భాలు గతంలో కోకొల్లలు.. కేంద్రం కూడా ఒక వర్గానికి రిజర్వేషన్ ఇవ్వడాన్ని స్వాగతించదు.
ఎందుకనగా హర్యానాలో జాట్ లు, గుజరాత్ లో పటేల్ లు అప్పటికే చాలా కాలం నుండి రిజర్వేషన్ కావాలని ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. ఒక రాష్ట్రం లో EWS రిజర్వేషన్లలో కొంత వాటా కేవలం ఒక వర్గానికి/ కులానికి కేటాయిస్తే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి డిమాండ్లు పెరిగిపోతాయి కాబట్టి కేంద్రం దీనికి ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించదు. ఇది ఏమాత్రం రాజకీయ జ్ఞానం ఉన్నా అర్దమయ్యే అంశం.. కానీ బాబు మరోసారి మోసం చేయబోయాడు. జగన్ మాత్రం అది నా పరిధిలో అంశం కాదని నేను చేస్తా అని మాటిచ్చి మోసం చేయలేనని బహిరంగంగా చెప్పేసాడు. అందుకు ప్రతిగా కాపు సామాజిక వర్గానికి ప్రతీ ఏడు రెండు వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో 10 వేల కోట్ల లబ్ధి చేకూరుస్తానని మాటిచ్చాడు.. అయితే ఈ అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం కాపు సామాజికవర్గానికి DBT ద్వారా ఎంత లబ్ధి చేకూర్చిందో చూద్దాం..
అమ్మఒడి పథకం ద్వారా 4,04,583 మంది లబ్ధిదారులకు 2,248.36 కోట్లు..
జగనన్న వసతి దీవెన ద్వారా 2,08,064 మంది లబ్ధిదారులకు 387.27 కోట్లు..
జగనన్న విద్యా దీవెన ద్వారా 2,29,030 మంది లబ్ధిదారులకు 1,315.16 కోట్లు..
జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా 103 మంది కి 11.29 కోట్లు..
వైయస్సార్ రైతు భరోసా ద్వారా 8,02,400 మందికి 4,729.67 కోట్లు..
వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల ద్వారా 5,52,662 మందికి 104.87 కోట్లు..
వైయస్సార్ ఉచిత పంట భీమా ద్వారా 4,33,909 మందికి 655.12 కోట్లు..
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 2,11,178 మందికి 191.64 కోట్లు..
మత్స్యకార భరోసా ద్వారా 1335 మందికి 2.13 కోట్లు..
సున్నా వడ్డీ పథకం ద్వారా 8,77,589 మందికి 437.02 కోట్లు..
వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా 7,45,172 మందికి 8,757.64 కోట్లు..
వైయస్సార్ ఆసరా ద్వారా 7,16,734 మందికి 2,083.21 కోట్లు..
వైయస్సార్ భీమా ద్వారా 8,150 మందికి 143.14 కోట్లు..
వైయస్సార్ కాపు నేస్తం ద్వారా 3,57,844 మందికి 2,028.77 కోట్లు..
వైయస్సార్ నేతన్న నేస్తం ద్వారా 2,577 మందికి 34.97 కోట్లు…
జగనన్న చేదోడు ద్వారా 18,019 మందికి 69.33 కోట్లు…
వైయస్సార్ వివాహ మిత్ర ద్వారా 25,046 మందికి 130 కోట్లు..
వైయస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా 28,638 మందికి 23.28 కోట్లు..
డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా 1,33,925 మందికి 520.50 కోట్లు..
ఇళ్ల నిర్మాణానికై DBT ద్వారా 1,35,236 మందికి 780.11 కోట్లు..
జగనన్న తోడు ద్వారా 1,79,686 మందికి 6.94 కోట్లు….
మొత్తం గా కాపు సామాజిక వర్గానికి 24,660.42 కోట్లు DBT ద్వారా డైరెక్ట్ గా అకౌంట్ లోకి జమ చేశాడు..
ఏ పైరవీ లేదు, ఎక్కడా లంచం మాటే లేదు.. వచ్చిన దానిలో వాటా అడిగినవాడే లేడు.. నీకింత అయితే నాకెంత అనే వాడే లేడు… అంతా పారదర్శకంగానే జరిగింది..
బాబు అయిదేళ్లలో చేసిన ఖర్చు 1340 కోట్లయితే జగన్ ప్రభుత్వం ఒక్క కాపు నేస్తం అనే పథకం ద్వారా కాపు సామాజికవర్గం వారి అకౌంట్లలో జమ చేసిన సొమ్ము 2,028.77 కోట్లు…
తన చేతిలో లేనిది నేను చేయలేను అని చెప్పడం గొప్పా? ఎన్నికల్లో గెలిస్తే చాలు తర్వాత వాళ్లదేం ఉంది అనుకోవడం గొప్పా?
ఇచ్చిన మాట కన్నా 6 ఇంతలు తక్కువ ఖర్చు చేయడం గొప్పా? ఇచ్చిన మాటకన్నా రెండింతలకన్నా ఎక్కువ ఖర్చు చేయడం గొప్పా?
ఎవరు కావాలి? మోసం చేసే వాడా? చెప్పింది చెప్పినట్టు చెప్పిన దానికన్నా ఎక్కువ చేయగలిగేవాడా? అని రేపొద్దున ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి నిలదీస్తే బాబు అండ్ కో నుండి ఎటువంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి…