జగన్ పై జరిగిన దాడిని హేళన చేస్తూ ట్విట్ చేసిన పవన్ కళ్యాన్ 24 గంటల గడవకముందే మళ్లీ ఓ తొర్రి ట్వీట్ వేశాడు. ” జగన్ పై జరిగిన దాడికి భాద్యత వహించాల్సిన వారే (రాష్ట్ర పోలీస్ లు) విచారణ ఎలా చేపడతారు? వివిఐపి క్యాటిగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ పరదాలు కట్టి, చెట్లు కొట్టేసేవారు” అంటూ తన పదోతరగతి ఫెయిల్ అయిన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు.
సదరు తొర్రి కూతల పవన్ కళ్యాణ్ కు తెలియని విషయం ఏమిటి అంటే, ఎంత పెద్ద ఘటన జరిగినా శాంతి భద్రతల విషయం లో మొదటి విచారణ భాద్యత రాష్ట్ర పోలీసు శాఖ వారిదే, ముందుగా వారు విచారణ చేపట్టాకే ఆ కేసు తీవ్రత బట్టి రాష్ట్రస్థాయి పోలీస్ ల నుండి సీబీఐకి గానీ ఇతర విచారణ సంస్థలకు గానీ బదిలీ చేయాలని ప్రభుత్వమో లేక కోర్టు వారో నిర్దేశిస్తారు. అంతేగాని తామంతట తాము ప్రాథమిక విచారణ కూడా చేయకుండా సీబీఐ, ఎన్ ఐ ఏ లాంటి విచారణ సంస్థలు విచారణ చేయాలని కోరలేవు, కోరవు. అలా కోరితే తాము ప్రాథమిక విచారణ కూడా చేయలేని అసమర్థులమని తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చుకున్నట్లు అవుతుంది.
ఇక మరో విషయం ఏమిటనగా ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ప్రస్తుతము ప్రతీ ప్రభుత్వాధికారి, ముఖ్యంగా పోలీస్ శాఖ వారు ఎన్నికల కమీషన్ వారి పరిధిలోనే పని చేయాలి, సీఎం ఆదేశాల కన్నా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు ఈసి వారి ఆదేశాలకే విలువ ఎక్కువ. కాబట్టి సీఎం సెక్యూరిటీ భాద్యత కూడా ఈసి వారిదే. ఇది ఓ మండల స్థాయి రాజకీయ నాయకుడికి కూడా అవగాహన ఉండే విషయం. తనను తాను మేధావినని, అంబేద్కర్ తో కూడా కలిసి తిరిగానని బిల్డప్ ఇచ్చుకునే పవన్ కు ఈ మాత్రం కూడా తెలియకుండా రాష్ట్ర పోలీస్ శాఖ వారి మీదే విమర్శలు చేస్తున్నాడు. వీవీఐపి అయిన సీఎం జగన్ సెక్యూరిటీ భాద్యత రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు కేంద్ర బలగాలు కూడా చూసుకుంటాయి, అంటే కేవలం రాష్ట్ర పోలీస్ లే కాదు కేంద్ర బలగాలు కూడా బాధ్యత వహించాలి. కానీ పవన్ కు ఈ విషయం కూడా అవగాహన లేదు. దాడికి బాదితుడు అయిన జగన్ మాత్రం ఎవరినీ ఇంతవరకు ఎవరినీ బ్లేమ్ చేసిందే లేదు. కానీ బ్లేడ్లతో నన్ను నా సెక్యూరిటీ ని కోస్తున్నారని జబర్దస్త్ జోకులు చేసే పవన్ మాత్రం తెగ హడావిడి చేస్తున్నాడెందుకో అర్థం కావడం లేదు. ఎంత ఎగిరినా జగన్ మాత్రం పవన్ కు కనీసం అటెన్షన్ ఇవ్వడు, బహుశా పవన్ ఈర్షకు కారణాల్లో ఇది కూడా ఒకటి అవ్వచ్చు..
కొసమెరుపు ఏమిటంటే. ఒకే ట్వీట్ ను తెలుగు, ఇంగ్లీష్, హిందీ లలో కూడా వేశాడు. ఆయన ఉద్దేశం లో కేంద్ర హోం శాఖ అధికారులు తన ఇంగ్లిష్ ట్వీట్ ను, బీజేపీ నాయకులు మోదీమరియు షా వంటి వారు ఈ ఎన్నికల హంగామాలో తీరికగా ఈయన ట్వీట్ చదువుతూ కూర్చుంటారని కాబోలు…