జనసేన పార్టీ.. ఆరాటమే తప్ప పోరాటం చేసేంత ప్రతిభలేదు.. పార్టీ పెట్టి పదేళ్ళు దాటుతున్నా ప్రసంగాలలో మైకు ముందు అరిచిన సంఘటనలైతే కోకొల్లలు కానీ పదవులు పొందిన దాఖలాలు లేవు.. ఒకే ఒక్క సీటు గెలుచుకోని ముఖ్యమంత్రిని డిసైడ్ చెయ్యగలను అని చెప్పుకుంటాడు పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పుట్టినప్పుడు ప్రజల్లో ముఖ్యంగా కాపుల్లో ఎంతో కొంత ఆదరణ లభించినప్పటికీ తరువాత పార్టీలో చేరిన అనుభవజ్ఞులు ఆ పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయారు. జనసేన పుట్టింది ప్రజల తరుపున ప్రశ్నించడానికి అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్.. టీడీపీ అధికారంలో ఉన్నన్ని రోజుల్లో చంద్రబాబు దగ్గర ప్యాకెట్ మనీ తప్ప ఏమీ అడగలేకపోయారనే విమర్శ మూట గట్టుకొన్నారు. తరువాత 2019 అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీని ప్రశ్నిస్తానంటూ టీడీపీ నుండి ప్యాకేజీ తీసుకుంటున్నారు, చివరికి టీడీపీతో పొత్తు పెట్టుకొంటాడు అన్న ప్రజల మాట చివరికి నిజం చేశాడు. ఇది జనసేన పార్టీ స్థితి. పరుగు పందెంలో పరిగెడుతూ పక్కనవాడు గెలవాలని కోరుకునేంత తెలివితక్కువ పార్టీ జనసేన.. అందుకే జనసేన అనే సపరేట్ పార్టీ ఉన్నప్పటికీ నిరంతరం టీడీపీకి చంద్రబాబుకు లోకేష్ కు భజన చేసుకుంటూ.. వారు గెలవాలని తాపత్రయపడుతుంటాడు పవన్.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు. పవన్ కుటుంబం కూడా లొకేష్ గెలుపు కోసం తాపత్రయ పడుతోందా అని పించక మానదు ఈ వార్త వింటే. . ఆ పార్టీని కుటుంబ ఆస్థిగా భావిస్తూ వీడియోల్లో మాత్రమే గొంతెత్తి గర్జించే నాగబాబు (పవన్ కళ్యాణ్ సోదరుడు) కూడా చంద్రబాబు కుటుంబ బాగుకోసమే పోరాడుతున్నాడు ఇప్పుడు . ఎంతలా పోరాడుతారంటే లోకేష్ పోటీ చేసే మంగళగిరి నియోజకవర్గంలో ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకునేంత పోరాడతారు.
ఈ మధ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేసిన నాగబాబు, అతని భార్య, కుమారుడు ఇప్పుడు కొత్త ఓటు కోసం ఏపీలోనూ దరఖాస్తు చేసుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలిం గ్ బూత్-168లో కొణిదల నాగబాబు (సీరియల్ నెంబర్-323), కొణిదల పద్మజ (సీరియల్-324), సాయి వరుణ్ తేజ్ (సీరియల్ నెంబర్-325) ఓటువేశారు. తాజాగా ఏపీలోని మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓట్ల కోసం ఫారం-6 తో దరఖాస్తు చేసుకున్నారు. నాగేంద్రబాబు అక్కడి ఎన్నికల్లో నాగేంద్రరావుగా ఓటు వేయగా.. ఇక్కడ నాగేంద్రబాబుగా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
2019 ఎన్నికలలో జనసేన పార్టీ తరుపున నాగబాబు నరసాపురం ఎంపీ స్థానానికి, పవన్ కళ్యాణ్ బీమవరం మరియు గాజువాక అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయారు. తాము ఓడిపోయినా ఆ నియోజకవర్గాల్లో అయినా తన ఓటును రిజిస్టర్ చేసుకోడానికి నాగబాబు ప్రయత్నాలు చేసుకోలేదు కానీ లోకేష్ పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గం లో మాత్రం ఓటు రిజిస్టర్ చేసుకుంటున్నాడు. తమ అన్నదమ్ములు ఎలాగూ గెలవలేము అని కనీసం లోకేష్ నయినా గెలిపించుకోవాలని అన్నదమ్ముల కృషి. లోకేష్ కోసం ఇంత ఆలోచిస్తున్నారంటే నాగబాబుకు టీడీపీ నుండి ఎంత ముడుతుందో మరి. లోకేష్ గెలుపు కోసం పవన్, నాగబాబు ఇంకెన్ని దారుణాలు, త్యాగాలు చేసి ఎక్కడ వరకు వెళతారో చూడాలి.