పవన్ కళ్యాణ్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. గత కొంతకాలంగా ప్రెస్మీట్లు, సభలు, వారాహీ యాత్ర వంటివి ఏమీ లేకుండా స్తబ్దుగా ఉండి, షర్మిళ న్యూస్‌కి ప్లేస్ ఇవ్వడం కోసమా అన్నట్టు సైలెంట్ గా ఉన్న పవన్ మళ్ళీ నిన్న రాజకీయ స్టేట్మెంట్స్ ఇచ్చారు.
ప్రజా ధనాన్ని ప్రజలకే పెంచే బాధ్యత తీసుకుంటాననీ, టీడీపీ జనసేన ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పధకం ఆగదనీ, జగన్ తన జేబులోంచి రూపాయి కూడా తీయడనీ, ప్రజల పక్షాన నిలబడతాననీ, ప్రశ్నిస్తాననీ, జనసైనికుల ఇన్సూరెన్స్ కోసం సినిమాలు చేసి మూడున్నర కోట్లు ఇస్తాననీ…. ఇలా ఎన్నో అంశాలను చేర్చి లేఖ విడుదల చేసారు. డ్వాక్రా మహిళల రుణాల మాఫీ కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.
అయితే ఈయన సపోర్ట్ చేస్తున్న ఇదే టీడీపీ ప్రభుత్వం 2014 లో డ్వాక్రా రుణాల మాఫీ చేస్తామంటూ ఊదరగొట్టింది. దానికి నాదీ పూచీ అని అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. అమలు చేయకపోతే ప్రశ్నిస్తా అని కూడా అన్నారు. కానీ… అప్పట్లో అసలు ఈ మాటే ఎత్తకుండా అయిదేళ్ళు గడిపేసారు కూడా. కనీసం వాళ్ళ చేత ఈ హామీలను అమలు చేయించలేకపోయానంటూ క్షమాపణ కూడా ప్రజలను అడగలేదు.
ఇదిలా ఉంటే పవన్‌కళ్యాణ్ స్వయంగా ఇచ్చిన హామీరైన రైల్వేకోడూరులో గ్రంధాలయం కట్టడం, భీమవరంలో అల్లూరి, సీతారామరాజు విగ్రహం పెట్టడం, వెంకట రాహుల్ అనే క్రీడాకారుడికి ఆర్ధిక సాయం చేస్తానని మొండి చేయి చూపడం , దామోదర సంజీవయ్య స్మారక భవనం నిర్మిస్తాననడం, ఇప్పటం గ్రామస్థులకు కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తాననడం వంటి వాటికే బాధ్యత తీసుకొని పవన్ కళ్యాణ్ టీడీపీ అధికారంలో ఉండగా ఆరొందల యాభై హామీలు ఇచ్చి మరిచిపోయిన చంద్రబాబుని ప్రశ్నిస్తా అనడం, పైగా ఆయన సియం అయితే ఈయన చక్రం తిప్పగలను అని అనుకోవడమే హాస్యాస్పదంగా ఉంది.