2024 సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో బిజెపి టిడిపి జనసేనల కూటమి ఖరారై , అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రచారంలో కూటమి వెనుకబడిందని చెప్పవచ్చు. చంద్రబాబు తలపెట్టిన ప్రజాగళం సభలకు ప్రజల నుంచి స్పందన కరువైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నారా లోకేష్ మంగళగిరికే పరిమితం అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆరోగ్యం బాగాలేదు అంటూ యలమంచిలి సభ వాయిదా వేశాడు. అటు పిఠాపురంలో వరుసగా మూడు రోజులు పర్యటన అంటూ మొదటి రోజు పర్యటించి రెండో రోజు జ్వరం అంటూ హైదరాబాద్ కి వెళ్ళిపోయాడు. బిజెపి నాయకులు పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగలేదు. ఇప్పుడు అసల సమస్య కూటమి నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయాలని భావిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఆ సభలలో పాల్గొంటాడో కూటమి నేతల్లో క్లారిటీ లేదు.
చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం చేయాలని కూటమినేతలు నిర్ణయించారు. కానీ కూటమి నేతల్లో ఇప్పుడు భయాందోళన మొదలైంది. చంద్రబాబు తలపెడుతున్న ప్రజాగళం సభలకు స్పందన కరువవడంతో పవన్ కళ్యాణ్ ఆ సభలలో పాల్గొంటే ఓట్లపై నమ్మకం పెట్టుకోవచ్చని కూటమి నేతలు భావించారు. కాని పవన్ కళ్యాణ్ తరచూ అనారోగ్యం అంటూ సభలు వాయిదా వేస్తుండడంతో టీడీపీ నేతలు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ నెల 10, 11 తేదీలలో తణుకు, నిడదవోలు, పి.గన్నవరం, అమలాపురం నియోజవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో నిర్వహించాలి అని షెడ్యూల్ ఖరారు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ చివరి క్షణంలో రాకపోతే ఏం చేయాలో తెలియక కూటమి నేతలు తలను పట్టుకుంటున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ నాన్ సీరియస్ పాలిటిక్స్ తో మొదటగా మోసం వస్తుందని నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ వస్తాడో రాడో మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.