పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ని ఓడించాలనే దృఢ నిశ్చయంతో కూటమిగా పోటీకి దిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణాలను సాకుగా చూపుతూ ఎన్నికల ప్రచారాన్ని పక్కనబెట్టి ఎప్పటికప్పుడు హైదరాబాద్ తుర్రుమంటూ ఎన్నికల ప్రచారానికి కూడా ఎగనామం పెడుతూ వస్తున్నారు.
ఇప్పుడు మరోసారి పవన్ పర్యటనలో జాగ్రత్తలు పాటించాలంటూ జనసేన అభిమానులను కోరింది. రికరెంట్ ఇన్ఫ్లుయంజా కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ముచేరి జ్వరంతో పవన్ ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయ్యొదంటు జనసేన కోరడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాకుండా కరచాలనాలు, ఫోటోల కోసం ఒత్తిడి చెయ్యొద్దు అంటు పూలు జల్లినప్పుడు నేరుగా ఆయన ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, అభిమానులకు జనేసన విజ్ఞప్తి చేసింది..
గతంలో వారాహి యాత్ర కొనసాగిస్తున్నప్పుడు ఎండకు తాళలేక వడ దెబ్బ తగిలి జ్వరం వచ్చిందంటూ ప్రచారాన్ని మధ్యలో వదిలి హైదరాబాద్ వెళ్లిన పవన్ కళ్యాణ్ తీరు పట్ల అప్పట్లో విమర్శలు చెలరేగాయి. మరోసారి సీపీఐ నాయకుడు మధుతో కలిసి కనీసం ఒక్క కిలోమీటర్ నడిచేలోపే విపరీతమైన అలసటతో ఇబ్బంది పడ్డ పవన్ కళ్యాణ్ అనంతరం ఎండ వస్తే వడ దెబ్బ, వాన పడితే జలుబు, చలికి వస్తే ఊపిరితిత్తుల్లో నిమ్ము అంటూ ప్రచారాన్ని ఎగ్గొట్టేందుకు అన్ని రకాల సాకులని వెతుక్కుంటున్నారనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో చెలరేగుతున్నాయి.
ఎన్నికల ప్రచారాన్ని చిత్తశుద్ధితో చేయడం మాని ఓపిక, ఓర్పు లేకుండా ప్రచారాన్ని ఎగ్గొట్టేందుకు ఆరోగ్య కారణాల ను సాకుగా చూపిస్తున్న పవన్ కళ్యాణ్ ఇక జగన్ పై ఎలా గెలుస్తాడంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం ఈసారైనా గెలవాలని ఓర్పుగా ప్రచారం చేయని పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓడిపోతే అందుకు కారణం పవన్ కళ్యాణ్ బద్ధకమే కారణంగా నిలుస్తుందని జనసైనికులు గుసగుసలాడుకుంటున్నారు.