పవన్ కళ్యాణ్ అంటేనే నిలకడ లేని రాజాకేయ నాయకుడు అని మనందరికీ తెలిసిన విషయమే.
మొన్నటిదాకా పవనన్న అసెంబ్లీకి వెళ్తాడు, “అధ్యక్షా” అంటాడు అని గంపెడు ఆశలు పెట్టుకున్న జనసైనికులను నిరాశపరచడం పవన్ కళ్యాణ్ కి అలవాటైన విద్య.
2014లో పార్టీ పెట్టి పోటీచెయ్యకుండానే చంద్రబాబుకి మద్దతు అన్నాడు. 2019లో పోటీ చేసిన రెండుదగ్గర్లా ఓడిపోయాడు. రెండు వేరువేరు భావజాలాలున్న బీజేపీ, కమ్యూనిస్టుల పొత్తు పెద్దగా పనిచెయ్యలేదు.
2024లో అడగకుండానే నేను టీడీపీకి మద్దతు ఇస్తున్నా అని అభిమానుల ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకి అప్పజెప్పడానికి ఏ మాత్రం సంశయించకుండా, టీడీపీ వాళ్లు చేసిన అవమానాలన్నీ మర్చిపోయి, రాజమండ్రికి వెళ్లి బాలయ్య&లోకేష్ తో కలిసి మీడియా స్టేట్మెంట్లు ఇచ్చేశాడు. జనసైనికులను మరో సారి నిరాశపరిచాడు.
ఇప్పుడు బీజేపీ కూడా టీడీపీ-జనసేనలతో కలుస్తుందేమో అని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో, పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బీజేపీ మద్దతుతో ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి పదవి చేపట్టాలని అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే గెలుపు భయం ఉండటంతో సేఫ్ సైడ్ గా ఉంటుందని భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చూద్దాం జనసైనికులకు మరోసారి నిరాశ పరుస్తాడో లేక సంతృప్తి పరుస్తాడో మన పవన్ కళ్యాణ్!