సుఖం అంటే పవన్ కళ్యాణ్ దే…
ఎన్నికలు దగ్గర పడుతుంటే దేశం మొత్తం ఎలక్షన్ ఫీవర్ ఉండగా, పెద్ద పెద్ద పార్టీ ల నుండీ ప్రతీ చిన్నా చితకా పార్టీలు కూడా ఎన్నికల సంసిద్ధత గురించి మల్లగుల్లాలు పడుతూ, పోరు కి సిద్ధం అవుతుండగా, పదేళ్ల క్రితం పార్టీ పెట్టి 2014 లో పోటీయే లేకుండా టీడీపీ కి మద్దతు తెలిపి, 2019 లో పోటీ చేసి కేవలం ఒక్కటంటే ఒక్కసీటు గెలిచి, స్వయానా పార్టీ అధ్యక్షుడే రెండు చోట్లా ఓడిపోయి, మళ్లీ 2024 ఎన్నికల లో పోటీ చేయబోతున్న పవన్ కళ్యాణ్ ని చూసి ఒక సగటు రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో నేర్చేసుకోవచ్చు…
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం గా ఉండాలి అంటూ తెలంగాణ లో పిలుపు ఇస్తాడు… తను మాత్రం ఎన్నికలకి సిద్ధం గా ఉన్నట్టు ఏ కోశానా కనపడదు..
పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా 175 నియోజకవర్గాల్లో కనీసం ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి ఒక మనిషి లేడు, ఎమ్మెల్యే కాదు కదా రాష్ట్రం మొత్తం లో ఒక వంద నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకరు చొప్పున సర్పంచ్ గా పోటీ చేయడానికి కూడా మంది దొరకరు..
పట్టుమని పది నియోజకవర్గాల్లో తప్పక గెలుస్తాం అని చెప్పుకునే స్థానాలు లేవు…
ఇరవై మంది సొంత అభ్యర్థులు దొరకరు…
2019 “అయామ్ ప్రాజెక్టింగ్ మైసెల్ఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సార్” అని చెన్నై లో అంటాడు…. 2024 కి వచ్చేసరికి ఏ మొహం పెట్టుకుని సీఎం కుర్చీ అడగాలి అంటాడు….
నువ్వెవడివి జగన్? నేను యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నువ్వు రాజకీయాల్లోనే లేవు అంటాడు… 16 ఏళ్లలో కనీసం వార్డ్ మెంబర్ కూడా అవ్వలేకపోయాడు…
ఒక పార్టీ కి అధ్యక్షుడిగా ఉండి కూడా 175 నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడో కూడా తనకే తెలియదు… ఒకేచోట మాత్రమే పోటీ చేయగలిగే సత్తానూ లేదు… సొంతగా తన సీటు కూడా గెలవని నాదెండ్ల ఏమో తన పార్టీ కి థింక్ ట్యాంక్.. రాజకీయాల నుండి ఎప్పుడో నిష్క్రమించిన, కనీసం రెండు నియోజకవర్గాల్లో కూడా ప్రభావం చూపలేని హరిరామ జోగయ్య ఏమో తన పార్టీ దిశా నిర్దేశకుడు..
పార్టీ పెట్టి ఇన్నేళ్లు అవుతున్నా పార్టీ మొత్తం లో చెప్పుకోడానికి నలుగురు నాయకులు లేరు.. మాటలో క్లారిటీ ఉండదు, ఆరోపణల్లో లాజిక్కు ఉండదు.. ఇవాళ బాబు దండగ అంటాడు, రేపు బాబు ఉంటేనే పండగ అంటాడు.. బీజేపీ పాచిపోయిన లడ్లు ఇచ్చింది అంటాడు, బీజేపీ తోనే దేశ భవిష్యత్తు అంటాడు… వాలంటీర్లు మహిళల అక్రమ రవాణా కు సహకరిస్తున్నారని అంటాడు మళ్లీ నాలుక్కరుచుకుని నేను అనలేదు అంటాడు…
ఒక పక్క సీఎం హోదాలో జగన్ సిద్దం అంటూ పబ్లిక్ మీటింగ్ లు పెట్టి క్యాడర్ లో జోష్ నింపుతున్నాడు, మరో పక్క బాబు మీటింగులు పెడుతున్నాడు, ఆఖరికి “ సంకారవం “ పేరుతో లోకేష్ కూడా టీవీల్లో కనపడుతున్నాడు కానీ, సీఎం,సీఎం, అంటూ అరవడానికి సిద్ధంగా ఉన్న జనసైనికుల ముందు పవన్ మొహం చూపెట్టే 6 నెలలు కావొస్తుంది…
ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చాడు పవన్ అంటే? యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో అదే స్థాయిలో ఉన్నాడు అంతే… పేరు మార్పు అంతే తప్ప, స్థాయి మారిందేమీ లేదు.. పాపం సినీమా పిచ్చోళ్ల అలజడి, సీఎం సీఎం అంటూ అరుపులు తప్ప, తనకు ఎమ్మెల్యే గా గెలిచే సత్తా కూడా తనకున్నట్టు పవన్ కి అనిపించదు…
అందుకే, తనెక్కడ పోటీ చేయబోయున్నాడో తనకి తెలియదు, తన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో తనకి తెలియదు, తన పార్టీ నుండి ఏ ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయబోతున్నారో తనకి తెలియదు, తన పార్టీ నుండి పోటీ చేస్తే ఎక్కడ ఏ స్థానం లో ఎవరు గెలిచే అవకాశం ఉందో కూడా తనకి తెలియదు…..
ఇన్ని తెలియకున్నా, ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నా పవన్ కళ్యాణ్ ఎంత ప్రశాంతంగా ఉంటాడో….
గెలుస్తాం అనే ఆశ లేదు, ఓడిపోతాం అనే భయం లేదు, ఎవర్ని ఎక్కడ పోటీకి పెట్టాలనే టెన్షన్ లేదు, ఎన్నికలు దగ్గరకొచ్చాయని కంగారు లేదు. కనీసం పార్టీ “గుర్తు” అయినా ఉందో లేదో తనకే గుర్తు లేదు…
సుఖం అంటే ఇదే కదా?