ఏపీ లో ఒక సినిమా స్టార్ గా ఒక సామాజిక వర్గం అండతో 2013 లో పార్టీనీ స్థాపించిన పవన్ కళ్యాణ్ నేడు కూటమి పొత్తుతో 2024లో అంతం చేశారు. 2013 లో పార్టీ పెట్టిన తరువాత పవన్ కళ్యాణ్ తనకు వేరే పార్టీ నాయకులు అవసరం లేదు, కులం, మతం,ప్రాంతం భేదాలు లేవు అంటూ యువతను కొంత ఆకట్టుకున్నారు. కానీ 2014లో జరిగిన ఎలక్షన్ లో ఒంటరి పోరాటం చెయ్యలేను పార్టీ పెట్టి కొన్ని నెలలే అయింది కాబట్టి పోటీలో ఉండలేను. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బిజెపి అగ్రనేత నరేంద్ర మోడీ ఇటు రాష్ట్రానికి, అటు దేశానికి మంచీ చేస్తారు అని నమ్ముతూ వారిద్దరికీ సంపూర్ణ మద్దతుతో పాటు వారి హామీలకు నాది భాధ్యత అని కూటమి తరుపున టీడీపీ, బిజెపి అభ్యర్థులకు ప్రచారం చేసి పెట్టారు. ఆ తరువాత కూడా తన సొంత పార్టీని బలోపేతం చేసుకోకుండా సినిమాలు చేసుకుంటూ సంవత్సరానికి ఒకటో రెండు సార్లు ఏపీకి వస్తూ టీడీపీ హామీలకు నాది భాధ్యత కాదు అంటూ తప్పించుకు తిరిగారు.
మళ్ళీ 2019 లో టీడీపీ, బిజెపి మోసం చేశారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అవినీతి చేశారు, అతని కొడుకు మా అమ్మను తిట్టించాడు, మోడీ ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు అంటూ విపరీతమైన ఆరోపణలు చేశారు. ఆ ఎలక్షన్ లో కమ్యూనిస్తులతో , బిస్పీతో జతకట్టి పోటీలోకి దిగారు కానీ పవన్ కళ్యాణ్ మాటలను చేతలను నమ్మని ఏపీ ప్రజలు కూటమికి డిపాజిట్లు కూడా ఇవ్వలేదు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను రెండు చోట్ల ఓడించారు. దాని తరువాత కూడా పవన్ కళ్యాణ్ ఏపీ కి రాకుండా జన సేన పార్టీనీ గాలికి వదిలి కనీసం గ్రామ, మండల కమిటీలు కూడా వెయ్యకుండా వదిలేశారు.
మళ్ళీ 2024 వచ్చేసరికి జన సేన పార్టీ కి బలం లేదు మనకు సియం పదవి షేర్ ఇచ్చే వారితో పొత్తు , 60 సీట్ల పొత్తులో ఇచ్చే వారితోనే కలిసి వెళ్లేది అని పార్టీ కార్యకర్తలను,నాయకులను నమ్మించి చివరకు 21 ఎంఎల్ఏ సీట్లు, 3 ఎంపీ సీట్లకు ఒప్పుకొని టీడీపీతో పొత్తు పెట్టుకునే సరికి దాదాపు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో జన సేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తట్టుకోలేకపొయ్యారు. ఎప్పటికీ వేరే పార్టీ జెండాలను మొయ్యలేము జెండా కూలీలుగా బతకలేము అంటూ జన సేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తిరుగుబాటు మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ మాత్రం వీటిని పట్టించుకోకుండా నాకు వ్యతిరేఖంగా మాట్లాడిన ప్రతీ ఒక్కరూ కూడా వైసీపీ కోవర్టు లు అంటూ కించపరిచేలా వారి వ్యక్తిత్వాన్ని అవమానించేలా మాట్లాడే సరికి జన సేన పార్టీకి ఒక్కొక్కరుగా రాజీనామా చేసుకుంటూ బానిస సంకెళ్లను తెంచుకొని బయటకు వచ్చారు.ఇలా ఒకరి తరువాత ఒకరుగా మొత్తం రాష్ట్రంలో దాదాపు 100 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జిలు జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు దాదాపు 120 నియోజకవర్గ గ్రామాల్లో జనసేనకు జెండా పట్టుకునే కార్యకర్తలు లేకుండా పోయారు. పవన్ కళ్యాణ్ టీడీపీకి బానిసగా మారిపోయాడు అని నమ్మి తమదారి తాము చూసుకున్నారు.
ఈ ఎలక్షన్ లో ఇప్పటికే సగం మంది టీడీపీ వారే జన సేన తరుపున పోటీ చేస్తున్నారు రేపు ఎలక్షన్ అవ్వగానే వారంతా తిరిగి టీడీపీ లో జాయిన్ అవుతారు ఇక జన సేన అనే పార్టీ బతకదు దీనికంతటికీ కారణం పవన్ కళ్యాణ్ నిర్ణయాలే అని జన సేన కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.