జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం పిఠాపురంగా ప్రకటించాడు. ప్రకటించిన మొదటి రోజే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. 2019 ఎన్నికల్లో గాజువా,క భీమవరం నియోజవర్గంలో ఓడిపోయిన వాడు ఇక్కడేం గెలుస్తాడు అనే స్థాయిలో టీడీపీ కార్యకర్తలు విమర్శలు చేశారు. టిడిపి నియోజక ఇన్చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ అనుచరులు పవన్ రాకను వ్యతిరేకిస్తున్నారు. పవన్ అభ్యర్థిత్వం ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విజయవాడకు పిలిపించుకొని పొత్తులో భాగంగా ఈ సీట్ పవన్ కళ్యాణ్ కి కేటాయించాల్సి వచ్చిందని, నిన్ను ఎమ్మెల్సీగా మొదటి కోటాలోనే చేస్తాను అనే హామీతో వర్మను సైలెంట్ చేసి, నువ్వు పవన్ కళ్యాణ్ కి తోడుగా నిలబడాలని చెప్పి ఎస్విఎస్ఎన్ వర్మనీ నియోజకవర్గానికి పంపాడు.
ఎట్టకేలకి పిఠాపురం స్థానాన్ని ఎంచుకున్న మొదట వర్మ వర్గీయులు చేత తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నా తరుణంలో చంద్రబాబు వర్మతో మాట్లాడి పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చేలా గొడవను తగ్గుముఖం పట్టేలా చేశాడు. కానీ అంతలోనే పిఠాపురం నియోజకవర్గంలో లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అంటూ బ్యానర్లు వెలిశాయి. అంటే మాకు ఎస్వీఎస్ఎన్ వర్మ నే కావాలి పవన్ కళ్యాణ్ వద్దు అంటూ అర్థం వచ్చేలా బ్యానర్లు వేశారు. మాకు పిలిస్తే పలికే ఎమ్మెల్యే కావాలంటూ, నియోజవర్గానికి గెస్ట్ గా వచ్చే నేత వద్దంటూ పిఠాపురం వాసులు నినాదిస్తున్నారు. దీంతో పిఠాపురంలో వెలసిన ఫ్లెక్సీలు టిడిపి పనేని అందరూ చర్చించుకుంటున్నారు. చంద్రబాబు దగ్గర సరేనన్న వర్మ, పవన్ పోటీ చేస్తే మాత్రం సహకరించరాదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తన అనుచరులు చెబుతున్నారు.
మరోవైపు వర్మ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసిన పెత్తనం తనదే ఉండాలి అంటూ ఇప్పటికే ప్రకటన చేశాడు. ప్రకటన చేసిన తర్వాత ఈ ఫ్లెక్సీల వ్యవహారం బయటపడడంతో పవన్ కళ్యాణ్ కి ఏ మాత్రం వర్మ సహకరిస్తాడు అనేది చూడాలి. ఒకవేళ వర్మ పైకి సహకరిస్తానని చెప్పిన వర్మ కార్యకర్తల మాత్రం సహకరించే పరిస్థితి లేదు.
అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజవర్గం ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అంటే కేవలం కాపు ఓట్లు 90000 ఉండడమే. రాష్ట్ర మొత్తం కాపు ఓటర్లు ఎక్కడ ఎక్కువ ఉన్నారని జల్లెడ పట్టి చివరికి పిఠాపురం ఎంచుకున్నాడు. 2019లో గాజువాక పోటీ చేసిన, భీమవరం పోటీ చేసిన 50,000 పైచిలుకు కాపు ఓట్లు ఉండడమే అక్కడ పోటీ చేసేలా చేసింది. 2024 ఓడిపోయిన రెండు చోట్ల పోటీ చేయకుండా, కొత్త స్థానాన్ని వెతికే పనిలో పెట్టుకొని తిరుపతి, తాడేపల్లిగూడెం, పిఠాపురం ఇలా అన్ని స్థానాల్లో ఒకటికి నాలుగు సార్లు సర్వే చేయించుకొని చివరకు పిఠాపురం స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ పైన మూడు స్థానాల్లో కూడా సర్వే చేయించుకోవడానికి ముఖ్య కారణం కాపు ఓటర్లు ఎక్కువగా ఉండడమే.
అయితే ఇప్పటికే పిఠాపురంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా వంగా గీత క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారు. సిట్టింగ్ ఎంపీ అయినా వంగా గీత గతంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహించారు. వంగా గీతకి పిఠాపురం నియోజకవర్గంలో గట్టి పట్టుంది. దీంతో పవన్ తన సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గం అనుకుంటున్నప్పటికీ అక్కడే అంత బలంగా ఉన్నా ఉందా గీతని ఎదుర్కొని విజయం సాధించడం అసాధ్యమని వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు వంగా గీత ప్రచారంలో దూసుకొని పోతుంటే, ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం నుంచి మద్దతు కరువై లోకల్ నాన్ లోకల్ స్థాయికి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అడుగులు ఏ విధంగా ఉంటాయో చూడాలి.