నువ్వు నా పార్టీనా.. తెలుగుదేశంనా.. భారతీయ జనతా పార్టీనా అనవసరం. గంటల లెక్కన కాల్షీట్లు ఇస్తున్నా. కావాలంటే కొనుక్కోండి. వచ్చి మైకు పట్టుకుని ఊగిపోతా’ ఎన్నికల సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధోరణి ఇది. ధన సేనానిగా మారిపోయి అందినకాడికి తీసేసుకుని ఫామ్‌హౌస్‌కు తరలిస్తున్నాడు.
పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పవన్ కాల్షీట్ రేటు పెరిగిపోయింది. ప్రచారం పేరుతో కోట్ల రూపాయలను అభ్యర్థుల నుంచి వసూలు చేస్తున్నాడు. ఈయన తొలి ప్రాధాన్యం బాగా డబ్బున్న వారికే. చంద్రబాబు సన్నిహితుడు సీఎం రమేష్ వద్ద అడ్డగోలుగా సంపాదించిన లెక్క దండిగా ఉంది. దీంతో ఈయన సేనాని కాల్షీట్లు ఎక్కువగానే కొనుగోలు చేసినట్లు ఉన్నాడు. పలుమార్లు వెళ్లి ప్రచారం చేశాడు. ఇందుకు పెద్ద మొత్తంలోనే డబ్బు తీసుకున్నట్లు సమాచారం.
ఇటీవల కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన సమయంలో చంద్రబాబు మైకు పట్టుకుని నోటికొచ్చిన అబద్ధాలు చెబుతూ ఉన్నాడు. ఈ క్రమంలో పవన్ మాట్లాడడం ఆపితే తాను బయలుదేరుతానని పేపర్‌పై రాసిచ్చాడు. బాబు నవ్వుతూనే ఆయనకు ప్రచారం టైమైందని ఇంతటితో ముగిస్తున్నానని చెప్పాడు. దీనిని బట్టి పవన్ అభ్యర్థుల తరఫున తిరుగుతానని పెద్ద మొత్తంలోనే వసూలు చేసినట్లు స్పష్టమవుతోంది. లేటయితే మరోచోటుకు వెళ్లలేమని, సాక్షాత్తు తన దత్తతండ్రికే సొల్లు చెప్పడం ఆపని పేపర్ మీద రాసిచ్చాడు.
బాగా బలిసిన అభ్యర్థులకే పవన్ అధిక సమయం కేటాయిస్తున్నారట. గంటకు రూ.50 లక్షలు తీసుకుని ప్రచారం చేస్తున్నాడని సమాచారం. ఓ జనసేన అభ్యర్థి తను అంత మొత్తం ఇచ్చుకోలేని, టికెట్ కోసమే పార్టీ ఫండ్ కింద చాలా ఇచ్చానని, అందువల్ల పవన్‌ను మీరే ఒప్పించి నా నియోజకవర్గానికి పంపాలని నాగబాబును అడిగితే అదంతా కుదరదని తెగేసి చెప్పాడట. దీంతో అవాక్కయిన సదరు అభ్యర్థి వీళ్లు పైకి పెద్ద మనుషుల్లా కనిపిస్తున్నారు కానీ పక్కా డబ్బు మనుషులని సన్నిహతుల వద్ద వాపోయాడని తెలిసింది.
పవన్ ప్రచారానికి వస్తే అతను అడిగినంత ఇచ్చేయాలని చంద్రబాబు కూడా తన పార్టీ వారికి చెప్పేశాడట. దీంతో వారు తమ ఊరికి రాకముందే సగం మొత్తాన్ని ఆయన మనుషులకు ఇచ్చేస్తున్నారని తెలిసింది. ప్రచారం చేసి వెళ్లాక మిగిలిన డబ్బును సమర్పించుకుంటున్నారని సమాచారం. సినిమా షూటింగ్‌ల్లో పాల్గొనకుండా పవన్ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. జనం టైం బాగోలేక రేపు కూటమి అధికారంలో వస్తే ఈయన నిమిషాల లెక్కన కాల్షీట్లు ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.