ఏప్రిల్ 20. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పుట్టినరోజు. ఓ సామాజికవర్గం, ఎల్లో గ్యాంగ్ సభ్యులు 19వ తేదీ రాత్రి నుంచే సోషల్ మీడియాలో అబద్ధాల పోస్టులను పెడుతున్నారు. కానీ శనివారం మధ్యాహ్నమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం ఇంకా స్పందన రాలేదు. బహుశా బాబు కూడా తన కుమారుడు లోకేశ్ చెప్పే విషెస్ కంటే కూడా దత్తపుత్రుడు చెప్పే మాటల కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. అతను తన సినిమా పరిచయాలను వాడి రైటర్ల చేత స్క్రిప్ట్ రాయిస్తూ ఉండొచ్చు.
ఒకవేళ పవన్.. బాబుకు విషెస్ చెబితే ఎలా ఉంటుందో అంటూ సోషల్ మీడియాలో ఔత్సాహికులు రాసుకొచ్చారు. ‘డియర్ దత్త తండ్రి గారూ.. మీ చరిత్ర పెన్సిల్‌తో రాయలేదు. బాల్ పాయింట్ పెన్నుతో బండెడు ఏ4 పేపర్లలో రాయబడింది. అవి సరిపోక సూపర్ కంప్యూటర్లో వాడాలేమో.. మీరు రైల్లో నుంచి గెంటేయబడని ఆంధ్ర పిత. కుల వివక్ష లేని సమాజం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి. సత్యనాదెళ్లకు స్ఫూర్తి ప్రదాత. పీవీ సింధూకి బ్యాడ్మింటన్ నేర్పించి మీరే. అబ్దుల్ కలాం రాష్ట్రపతి భవన్ మెట్లు ఎక్కాడంటే అది మీ పుణ్యమే. వాజ్‌పేయి ప్రధాని అయినా ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపింది మీరే. చాలా ఏళ్లుగా సంక్రాంతికి ప్రతి ఒక్కరూ సొంతూరికి వెళ్తున్నారంటే అది మీ వల్లే. ఎండల బారిన నుంచి ప్రజల్ని రక్షించేందుకు ఉష్ణోగ్రతలు తగ్గించారు. నన్ను ఇష్టపడని తమ్ముడు లోకేశ్ చెప్పాడని ప్రధానమంత్రి పదవిని వద్దన్నారు. అమరావతిలో ఒలింపిక్స్ పెట్టాలని ప్రయత్నించిన ఆటగాడు మీరు. నేడు దేశంలో సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందిందంటే అది మీ వల్లే. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయంటే అది మీ పుణ్యమే. కుప్పం కూరగాయలతో అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధాని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసేలా చేసింది మీ సంకల్ప బలమే. హైదరాబాద్ నిర్మాత మీరే. దానిని ప్రపంచపటంలో గీసింది మీరే. ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలని విదేశాల్లో సాన్నం కూడా చేయకుండా తిరిగిన కాళ్లు మీవే. ఓ అమరావతి సృష్టికర్తా.. కాబోయే భారత ప్రధాని అంటూ 2018లో అమెరికా ప్రజల చేత చెప్పించుకున్న నేతా (అంటే ఇది ఎల్లో మీడియాలో వచ్చిందిలే). అసలు ఎన్టీ రామావుకు పార్టీ పెట్టమని సలహా ఇచ్చిందని మీరేనని తెలిశాక పులకించిపోయా’ ఎన్నని చెప్పను. ఏమని చెప్పను. ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ రాసుకోవాలంట. మిగతావి వచ్చే సంవత్సరం రాద్దామన్నాను.
ఫైనల్‌గా ఒక్క మాట. మీరు ప్రజారాజ్యాన్ని మూయించకపోయుంటే మనం కలిసేవారం కాదు. నా చేత జనసేన పెట్టించారు. ప్యాకేజీలు పంపుతున్నారు. నా పార్టీలోనూ మీరే సీట్లు ఇచ్చారు. ఎన్ని జన్మలెత్తినా మన బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఈ రాతల్ని పవన్ బాబు పర్సనల్ ఫోన్‌కు మెసేజ్ పంపాడనే అనుకుందాం. బయటికి మాత్రం శ్రీనారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు అనుకున్నవి నెరవేరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా అంటూ ప్రెస్‌నోట్ విడుదల చేస్తాడు.